మళ్లీ దొరికిపోయిన తమన్..? ట్రోల్స్ మామూలుగా లేవుగా
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 25న విడుదల అయింది. అంచనాలకు తగ్గట్లే భారీ స్థాయిలో రిలీజ్ అయింది. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఇప్పటికే రూ. 200 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ దిశగా సాగుతోంది. పవర్ స్టార్ మునుపెన్నడూ చేయని విధంగా గ్యాంగ్ స్టర్ పాత్రలో మెప్పించారు.
అయితే ఓజీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ నడుస్తున్నాయి. ఈ సినిమాలోని కొన్ని పాటలను ఆయన ఇతర ఆల్బమ్స్ నుంచి కాపీ కొట్టినట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాలో విలన్ ఇమ్రాన్ హష్మీ ఎంట్రీ సమయంలో వచ్చే ఆయన కొట్టిన మ్యూజిక్ ఇతర ఆల్బమ్ నుంచి కాపీ కొట్టారని ట్రోల్స్ నడుస్తున్నాయి. ఈ మ్యూజిక్ సేమ్ టూ సేమ్ అల్బేనియన్ సింగర్ హైకా పాడిన పాట లాగే ఉండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

గతంలోనూ తమన్ పై ఈ రకమైన ట్రోల్స్ వచ్చాయి. బిజినెస్ మ్యాన్ టైమ్ నుంచే ఆయన ట్యూన్స్ కాపీ అంటూ పలురకాలుగా కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో ఇదే విషయంపై ఆయన స్పందిస్తూ ట్యూన్స్ కాపీ కొట్టి ఇంటికి వెళ్తే అమ్మ అన్నం పెడుతుందా..? అని గతంలో తమన్ తీవ్రంగానే ఖండించారు. కానీ మరోసారి అడ్డంగా దొరికిపోవడంతో ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు ట్రెండింగ్ చేస్తున్నారు నెటిజెన్లు. మరి వీటిపై తమన్ ఎలా స్పందిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications