'తండేల్' రికార్డుల మోత..తెలుగు సినిమా చరిత్రలో అరుదైన రికార్డు
అక్కినేని నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన చిత్రం 'తండేల్'. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. జాలరి పాత్రలో నాగ చైతన్య కనిపించగా, అతన్ని ప్రేమించే పాత్రలో సాయి పల్లవి నటించారు. గాఢంగా ప్రేమించుకున్న జంట అనూహ్యం ఎడబాటుకు గురి అవుతుంది.
ప్రేమికులు తిరిగి ఎలా కలుసుకున్నారనేది 'తండేల్' కథ.ఈ కథలో దేశభక్తిని కూడా దర్శకుడు జోడించారు. దీంతో సినిమా అద్భుతంగా ఉందని ప్రేక్షకులు కితాబిస్తున్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి పోటీపడి నటించారు. మొదటి భాగంలో సాయి పల్లవి ఎమోషన్స్ బాగా పండాయి. అదే విధంగా సాయి పల్లవిని డామినేట్ చేస్తూ నాగ చైతన్య నటించారు. చివర 20 నిమిషాలు సినిమా మరో లేవల్లో ఉందని ప్రేక్షకులు అంటున్నారు.

చందు మొండేటి సినిమాను తన దర్వకత్వంతో కట్టిపడేశాడు.ఇదింతా ఒక ఎత్తు అయితే, దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం మరో ఎత్తు అని ప్రశంసలు కురిపిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది. మరోవైపు కలెక్షన్లలో కూడా 'తండేల్' సత్తా చాటింది. 'తండేల్' సినిమాకు తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 21.27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా రేంజ్‌లో సినిమా విడుదలైనప్పటికీ తెలుగులోనే అత్యధికంగా వసూళు సాధించింది. నాగచైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా 'తండేల్' రికార్డ్ క్రియేట్ చేసింది.అంతేకాకుండా ఫిబ్రవరిలో విడుదలైన తెలుగు సినిమాల్లో ఇంత భారీ ఓపెనింగ్ మరే ఏ సినిమా సాధించలేదు.దీంతో అరుదైన ఘనత సాధించిన సినిమాగా తండేల్ నిలిచింది. సినిమా పాజిటివ్ రివ్యూస్ రావడంతో వీకెండ్‌లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications