హిట్ కొట్టామనే ఆనందం నాగ చైతన్యకు ఒక్కరోజు కూడా మిగల్చలేదే..!
అక్కినేని నట వారసుడుగా ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. తాత, తండ్రి వారసత్వాన్ని నాగచైతన్య కొనసాగిస్తారని అభిమానులంతా భావించారు. అయితే నాగచైతన్య హీరోగా నిలబడటానికి నానా తంటాలు పడుతున్నాడు. నాగచైతన్య ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించాడు . కానీ హిట్ కొట్టింది మాత్రం చాలా చాలా తక్కువే అని చెప్పాలి. చైతన్య కెరీర్‌లో ఇప్పటి వరకు బ్లాక్ బ్లాస్టర్ హిట్ ఒక్కటి కూడా లేదు.
సరైన హిట్ కోసం చాలాకాలంగా వేచి చూస్తోన్న నాగ చైతన్య 'తండేల్' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మూడేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డ నాగ చైతన్య, ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు.అందరు అనుకున్నట్టుగానే సినిమా పాజిటివ్ రివ్యూస్‌ను సొంతం చేసుకుంది. సినిమా చూసిన ప్రేక్షకులు బాగుందని కితాబిస్తున్నారు.ఉత్తరాంధ్రకు చెందిన జాలరి పాత్రలో నాగ చైతన్య అద్భుతంగా నటించారు. అదే విధంగా సాయి పల్లవి సైతం ఆకట్టుకుంది.

నాగ చైతన్య, సాయి పల్లవి పోటీపడి నటించారు. మొదటి భాగంలో సాయి పల్లవి ఎమోషన్స్ బాగా పండాయి. అదే విధంగా సాయి పల్లవిని డామినేట్ చేస్తూ నాగ చైతన్య నటించారు. చేపల వేటకు వెళ్లే యువకుడిగా, ప్రేమికుడిగా, జాలరి గ్యాంగ్‌కు లీడర్‌గా, పాకిస్థాన్‌లో దొరికిపోయిన జాలరిగా ఇలా విభిన్న పాత్రల్లో నాగ చైతన్య మెప్పించారు.ఈ తండేల్ మూవీకి దేవిశ్రీ సాంగ్స్ బ్యాక్ బోన్‌గా నిలిచారు.ఈ మధ్య కాలంలో దేవిశ్రీ ఇచ్చిన బెస్ట్ ఆల్బమ్ అన్నమాట వినిపిస్తుంది.
SHOCKING : The HD print of #Thandel has been leaked, just like #GameChanger! 😳
— Narendra News (@Narendra4News) February 7, 2025
చందు మొండేటి మరోసారి తన దర్శకత్వంతో తెర మీద మ్యాజిక్ చేశారు. అయితే 'తండేల్' సినిమాతో హిట్ కొట్టామనే ఆనందం నాగ చైతన్యకు ఒక్కరోజు కూడా మిగల్చలేదు. సినిమా మొత్తం ఆన్‌లైన్లో ప్రత్యక్షం అయింది. 'తండేల్' మూవీ హెచ్డి క్వాలిటీతో డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులోకి రావడం విశేషం. ఈ పైరసీ వల్ల 'తండేల్'కు భారీ ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. తమిళ్ రాకర్స్, ఫిల్మి జిల్లా, మూవీస్ వంటి వెబ్‌సైట్‌లలో హెచ్డి క్వాలిటీతో 'తండేల్'ప్రత్యక్షం అయింది. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications