"తండేల్" మూవీకి వెళ్తున్నారా..?.. ఈ విషయాలు తెలుసుకోండి..!

అక్కినేని యువసామ్రాట్ నాగ చైతన్య, డ్యాన్సింగ్ క్వీన్ సాయిపల్లవి కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ "తండేల్" ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ(ఫిబ్రవరి 7) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విదేశాల్లో నిన్న రాత్రి నుంచే షోస్ ప్రారంభం అయ్యాయి. ఇవాళ ఉదయం ఆట నుంచే సినిమాకు పాజిటివ్ టాక్ దక్కింది. సినిమాలో చైతూ, సాయి పల్లవి కెమిస్ట్రీ అద్భుతంగా ఉందని ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా ఇండియాలో తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అయింది.

ఇక మీరు కూడా తండేల్ మూవీని చూడాలి అని ఆరాటపడుతున్నారా.. ? అయితే సినిమా చూసేముందు తండేల్ కు సంబంధించిన ఈ ఆసక్తికర విషయాలు తెలుసుకుంటే మూవీని ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమాకోసం గతంలో ఎన్నడూలేని విధంగా డీగ్లామర్‌ రోల్ చేశారు చైతూ, సాయి పల్లవి. సముద్రంలో, ఎండలో, ఇసుకలో తీసిన సీన్స్ కోసం ఇద్దరూ బాగా కష్టపడ్డారని ఇటీవల ప్రీ- రిలీజ్ ఈవెంట్ లో చిత్రయూనిట్ వాళ్లని తెగ పొగిడేసింది. ఈ సినిమా మొత్తం లవ్ స్టోరీలా సాగుతుందని.. సినిమాలో రెండు ఫైట్స్ మాత్రమే ఉన్నాయని తెలుస్తోంది.

Thandel Releases Today Must-Know Facts Before Watching the Movie Pan India
తండేల్ అర్థం ఇదే..

'తండేల్' అనే పదం గుజరాతీ నుంచి తీసుకున్నారు. గుజరాతీలో ఈ పదానికి అర్థం లీడర్ ్
అట. శ్రీకాకుళం జిల్లా డి మత్స్యలేశం గ్రామంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు చందూ మొండేటి రాసుకున్నారు. సముద్రంలో వేటకు వెళ్లిన 22 మంది మత్స్యకారులు గుజరాత్​ పోర్ట్ కు వెళ్లిన సమయంలో దారితప్పి పాకిస్థాన్ సీ వాటర్స్ వెళ్తారు. దీంతో వాళ్లని పాకిస్థాన్ అధికారులు అరెస్ట్​ చేస్తారు. ఇక వాళ్లు జైలు నుంచి ఎలా బయటపడ్డారనేదే కథ.

చైతూ కెరీర్ లో..

నాగ చైతన్య కెరీర్ లో అత్యధిక బడ్జెట్ లో తెరకెక్కిన సినిమా ఇదే. ఈ సినిమాను దాదాపు రూ. 90కోట్లతో తెరకెక్కించినట్లు సమాచారం. అయితే మొదట్లో అనుకున్న దానికంటే ఈ సినిమా బడ్జెట్​ భారీగానే పెరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో పాకిస్థాన్ జైలు ఎపిసోడ్ తక్కేవేనని టాక్. కేవలం 20 నిమిషాల నిడివి ఉంటుందని తెలుస్తోంది. కథకు తగ్గట్లుగానే పాకిస్థాన్ జైలు సీన్లను అక్కడక్కడా అమర్చారు డైరెక్టర్. అంతేకాక ఈ సినిమా కోసం హైదరాబాద్​ లోనే ఓ భారీ జైలు సెట్ వేసి చిత్రీకరణ చేశారట.

సముద్రంలో 30 డేస్..

తండేల్ మూవీ కోసం ..కేవలం సముద్రం మీదనే 30 రోజుల పాటు షూటింగ్ చేశారు. తుపాను ఎపిసోడ్ తప్ప మిగిలినవన్నీ అక్కడే చిత్రీకరించారు. మంగళూరు, కేరళ, వైజాగ్, గోవా, శ్రీకాకుళం ఇలా చాలా తీర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. దీనికితోడు మంగళూరు సముద్రం దగ్గర ఓ విలేజ్ సెట్ కూడా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+