Hero: దసరాకు కూడా హీరోకు మోక్షం రాలేదు, అందుకే ఆ సామెత

స్యాండిల్ వుడ్ చాలెంజింగ్ స్టార్ దర్శన్ కు పరిస్థితులు అనుకూలంగా లేవని తెలుస్తోంది. కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన ఓ సామాన్యడైన రేణుకస్వామి అనే యువకుడి హత్య కేసులో స్టార్ హీరో దర్శన్, కన్నడ నటి పవిత్ర గౌడతో పాటు 17 మంది అరెస్టు అయ్యి జైలుకు వెళ్లి 110 రోజులు అవుతుంది. ఈ కేసులో బళ్లారి సెంట్రల్ జైల్లో ఉన్న కన్నడ హీరో దర్శన్ బెయిల్ మీద బయటకు రావాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు.

అయితే హీరో దర్శన్ బెయిల్ పిటిషన్ రోజు రోజుకు వాయిదా పడుతూ వస్తుండటంతో ఆయన బళ్లారి సెంట్రల్ జైలులోనే దసరా పండుగ చేసుకున్నారు. హీరో దర్శన్ తరుపున క్రిమినల్ లాయర్ నాగేష్ కోర్టులో వాదనలు నీటి వినిపిస్తున్నారు. హీరో దర్శన్ కు బెయిల్ రాకుండా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్న కుమార్ కోర్టులో గట్టిగా వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పటికై అనేక వాయిదాలలో హీరో దర్శన్ తరపున లాయర్ నాగేష్ వాదనలు వినిపించారు.

The arguments of both sides have been completed in the court on hero Darshan s bail petition

పోలీసులు తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్న కుమార్ వాదనలు వినిపించారు. రేణుకస్వామి హత్య కేసులో హీరో దర్శన్ ఏ 2 నిందితుడని, అతనికి బెయిల్ మంజూరు చెయ్యకూడదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్న కుమార్ కోర్టుకు మనవి చేశారు. ఎఫ్ఐఆర్ లో అనేక లొసుగులు ఉన్నాయని, సాంకేతిక సాక్షాలు కూడా హీరో దర్శన్ కు వ్యతిరేకంగా లేవని, దర్శన్ కచ్చితంగా తప్పు చేశాడని పోలీసులు నిరూపించేకపోతున్నారని, అందుకే దర్శన్ కు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది నాగేష్ కోర్టులోవాదించారు.

సుమారు ఐదు గంటల పాటు లాయర్లు నాగేష్, పీపీ ప్రసన్న కుమార్ కోర్టులో వాదనలు వినిపించారు. వదనలు పూర్తి కావడంతో సోమవారం రోజుకు విచారణ వాయిదా పడింది. సోమవారం హీరో దర్శన్ కు కచ్చితంగా బెయిల్ వస్తుందని ఆయన అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. హీరో దర్శన్ కు దసరా పండుగలోపు బెయిల్ వస్తుందని అందరూ ఊహించుకున్నారు. అయితే హీరో దర్శన్ కు మాత్రం దసరా పండుగకు కూడా బెయిల్ రాకపోవడంతో ఆయనతో పాటు ఆయన అభిమానులు నిరాశకు గురైనారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+