Bigg Boss 9 : బిగ్ బాస్‌లో చిచ్చర పిడుగు.. ఇక రచ్చే
ఎన్నో ఉత్కంఠభరితమైన మలుపులు, అనూహ్య ఎంట్రీల తర్వాత బిగ్ బాస్ 9 తెలుగు గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ముగింపుకు చేరింది. బిగ్ బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా సామాన్యురాలు ప్రియ హౌస్‌లోకి అడుగుపెట్టారు.
అగ్ని పరీక్ష ద్వారా ఎంపికైన ఐదుగురు సామాన్యులలో ప్రియ ఒకరు. మర్యాద మనీష్, హరీష్, కళ్యాణ్, పవన్ మరియు శ్రీజ తర్వాత చివరిగా హౌస్‌లోకి అడుగుపెట్టిన ప్రియ, హౌస్‌లో తమకు మద్దతు ఇవ్వాలని అభిమానులను కోరారు. ఈసారి బిగ్ బాస్ హౌస్‌లో సామాన్యులు సెలబ్రిటీల మధ్య గట్టి పోటీ ఉండబోతోందని స్పష్టమవుతోంది.

ఈ సీజన్‌లో తనుజ, ఆశాశైనీ, భరణి, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రాని, సుమన్ శెట్టి, రాము రాథోడ్, శ్రేష్టి వర్మ వంటి సెలబ్రిటీలు హౌస్‌లోకి వచ్చారు. మరోవైపు, సామాన్యుల నుంచి ప్రియ, కళ్యాణ్, హరీష్, పవన్, శ్రీజ వంటివారు ప్రవేశించారు.
ఈ సీజన్‌లో ఎవరు గెలుస్తారో, ఎవరు ఎలా ఆడుతారో చూడాలి. ఇప్పుడు కంటెస్టెంట్స్ అందరూ హౌస్‌లోకి రావడం పూర్తయింది కాబట్టి, అసలైన బిగ్ బాస్ ఆట నేటి నుంచి మొదలైనట్లే.












Click it and Unblock the Notifications