బిగ్‌బాస్ ఎన్ని సీజన్లు వచ్చినా..ఆ సీజన్‌ను కొట్టడం ఎవరితరం కాదు..!
సంచలనాలకు మారుపేరుగా నిలిచే బిగ్‌బాస్ షో, తెలుగులో మరో సీజన్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఎనిమిది విజయవంతమైన సీజన్‌లు పూర్తి చేసుకున్న తర్వాత, బిగ్‌బాస్ 9వ సీజన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత మూడు సీజన్‌లు అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోవడంతో, ఈసారి కొత్త వ్యూహాలతో, రెట్టింపు ఉత్సాహంతో తిరిగి వస్తున్నట్లు తెలుస్తోంది.
హోస్ట్ మారుతారని ప్రచారం జరిగినా, కింగ్ నాగార్జుననే 9వ సీజన్‌కు కూడా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేస్తున్న భారీ సెట్ దాదాపు పూర్తైంది. ప్రేక్షకులను నిరాశపరిచిన గత సీజన్‌ల నుంచి పాఠాలు నేర్చుకున్న షో నిర్వాహకులు, ఈసారి టీఆర్‌పీ రేటింగ్‌లను పెంచడానికి ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఈ సీజన్ మునుపటి సీజన్‌ల కంటే భిన్నంగా ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. బిగ్‌బాస్ చరిత్రలోనే మొదటిసారిగా, కంటెస్టెంట్‌లను రెండు వేర్వేరు హౌస్‌లలో ఉంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇది షోలో ఉత్కంఠను, అనూహ్య మలుపులను మరింత పెంచుతుందని ఆశిస్తున్నారు.
ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కంటెస్టెంట్‌ల జాబితా కూడా అంచనాలను రెట్టింపు చేస్తోంది. ఈసారి హౌస్‌లోకి సినిమా తారలు, టీవీ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, కమెడియన్లు అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది. కొత్త తరం కంటెస్టెంట్‌లతో, విభిన్నమైన గేమ్స్‌తో ఈ సీజన్ ప్రేక్షకులను అలరిస్తుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే రెండో సీజన్‌ను మించిన సీజన్ రాదని అభిమానులు నొక్కి చెబుతున్నారు. రెండో సీజన్‌లో హీరో నాని హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ సీజన్ మొత్తం కూడా పెద్ద యుద్దమే అని చెప్పాలి. చాలామంది సెలబ్రిటీలు రెండో సీజన్‌లో సందడి చేశారు. అయినప్పటికీ విన్నర్‌గా కౌశల్ నిలిచాడు. విపరీతమైన సిందతితో మనోడు విజయం సాధించాడు. కౌశల్ పేరిట బయట ఆర్మీలుగా ఏర్పడి అతనికి మద్దతుగా నిలిచారు. కౌశల్ అభిమానుల దెబ్బకు నాని హోస్టింగ్‌కు గుడ్ బై చెప్పేశాడు. అలా రెండో సీజన్ బిగ్‌బాస్ చరిత్రలో మరుపురానిదిగా నిలిచింది.












Click it and Unblock the Notifications