పెళ్లికి ముందు శోభిత ధూళిపాళకు భారీ ఎదురు దెబ్బ
తెలుగు అమ్మాయిలు హీరోయిన్‌గా ఆఫర్లు దక్కించుకోవడం కష్టం అనుకుంటున్న సమయంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ సినిమాలు చేసి నటిగా తనను తాను నిరూపించుకున్న ముద్దుగుమ్మ శోభితా ధూళిపాళ. 2013లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. రామన్ రాఘవ్ 2.0 (సైకో రామన్)తో తన అరంగేట్రం చేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటే ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.
ఇదే సమయంలో హీరో నాగ చైతన్యతో ప్రేమయాణం సాగించి మరింత వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా నాగ చైతన్య వల్లే శోభితా ధూళిపాళ లైఫ్ లైన్‌లోకి వచ్చింది.సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో మెయిన్‌టైన్ చేశాడు. ఈక్రమంలోనే నాగ చైతన్య , శోభిత ధూళిపాళ సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. శోభిత ధూళిపాళ సినిమాల్లో యమ హాట్‌గా కనిపిస్తుంటుంది. రొమాంటిక్ సీన్లలో సైతం రెచ్చిపోయి నటిస్తోంది. అయితే పెళ్లి తర్వాత ఇలాంటి సినిమాలకు శోభిత దూరంగా ఉంటారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఎన్నో ఆశలు పెట్టుకున్న శోభిత ధూళిపాళకు నిరాశ ఎదురైంది. ఈసారి ఎమ్మీ అవార్డుల్లో అక్కినేని కోడలు శోభిత ధూళిపాల నటించిన ది నైట్ మేనేజర్ పోటీబరిలో నిలవడంతో భారతీయ అభిమానుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఆ సినిమాకు అవార్డు దక్కలేదు. అయితే ది నైట్ మేనేజర్ పురస్కారాన్ని దక్కించుకోలేకపోయినా శోభిత నటనకు ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా హాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో శోభిత సినిమా మెరిసిందనే చెప్పాలి. ఈ చిత్రంలో ఆదిత్య రాయ్ కపూర్, అనిల్ కపూర్ వంటి స్టార్లు నటించారు. ది నైట్ మేనేజర్ ఉత్తమ డ్రామా విభాగంలో ఫ్రెంచ్ నాటకం లెస్ గౌట్టెస్ డి డైయు (డ్రాప్స్ ఆఫ్ గాడ్)కు అవార్డును కోల్పోయింది. అంతర్జాతీయ ఎమ్మీ అవార్డులు ఫ్రెంచ్ డ్రామా లెస్ గౌట్టెస్ డి డైయును విజేతగా ప్రకటించిన తర్వాత శోభిత సహా భారతీయ అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు.












Click it and Unblock the Notifications