హన్సికపై స్టార్ హీరో లైంగిక వేధింపులు
సినీ పరిశ్రమలో అందరిలానే తాను కూడా చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని స్టార్ హీరోయిన్ హన్సిక వెల్లడించింది. ప్రస్తుతం ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ వివాదం సినీ పరిశ్రమను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. మైనర్ గా ఉన్నప్పటినుంచే తనపై లైంగిక వేధింపులకు పాల్పడటంతోపాటు బలాత్కారం చేశాడంటూ శ్రేష్టి వర్మ అనే లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గోవాలో ఉన్న జానీమాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే హన్సిక విషయం బయటకు వచ్చింది.
డిజైనర్లు దురుసుగా ప్రవర్తించారు
హీరోయిన్ గానే కాకుండా మోడలింగ్ చేసే సమయంలో కూడా కొంతమంది డిజైనర్లు దురుసుగా ప్రవర్తించేవారిన తెలిపింది. అనేక సినిమాల్లో పలువురు స్టార్ హీరోల సరసన నటించిన హన్సిక ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తాను కోరుకున్నట్లుగా డిజైన్ లో దుస్తులు కావాలంటే ఇచ్చేవారు కాదని, తామిచ్చింది వేసుకోవాలని ముఖంమీదే చెప్పేవారని వాపోయింది.

బలవంతం చేస్తే గట్టిగా బుద్ది చెప్పా
సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన కొత్తలో ఓ స్టార్ హీరో తనను డేట్ కు రమ్మని అడిగారని, తాను కుదరదని చెప్పానన్నారు. ఇష్టం లేదని చెప్పినప్పటికీ బలవంతం చేయబోయాడని, అతనికి తనదైన శైలిలో గట్టిగా బుద్ధి చెప్పానని, అప్పటినుంచి అతను తన జోలికి రావాలంటేనే భయపడ్డాడని చెప్పింది. మోడలింగ్ లో ఎవరైతే దురుసుగా మాట్లాడారో వారే తాను హీరోయిన్ అయిన తర్వాత తనకు అసిస్టెంట్ డిజైనర్స్ గా వ్యవహరించారని హన్సిక వెల్లడించింది. సినీ పరిశ్రమలోకి వచ్చే అమ్మాయిలంతా ఎంతో ధైర్యంగా ఉండాలని, అలా ఉంటేనే ఇలాంటి హీరోలను ధైర్యంగా ఎదుర్కోగలమన్నారు. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ సినిమాల్లో హన్సిక నటించింది. అల్లు అర్జున్ తో దేశముదురు సినిమా చేస్తున్న సమయంలో తన వయసు కేవలం 15 సంవత్సరాలంటే ఆశ్చర్యం వేయక మానదు.












Click it and Unblock the Notifications