49 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్
సినీ పరిశ్రమ అన్న తర్వాత ప్రేమలు ఉంటాయి.. పెళ్లిళ్లు ఉంటాయి.. విడాకులు ఉంటాయి.. ఇవన్నీ కూడా ఎంతో సహజంగా జరుగుతుంటాయి. దీంతో దూరం నుంచి ఈ పరిణామాలు గమనిస్తున్న ప్రేక్షకులు అయ్యో.. అలా చేశారేంటి? సంప్రదాయాల ప్రకారం నడుచుకోకుండా వ్యవహరిస్తున్నారేంటి? అంటూ బాధపడుతుంటారు. కొందరు హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. ఇరువైపులా ఒప్పుకోకపోవడం, లేదంటే మరే ఇతర కారణాలవల్లో పెళ్లి చేసుకోవడం కుదరదు. దీంతో చాలామంది ఒంటరిగా ఉండిపోతున్నారు. హీరోలకన్నా హీరోయిన్లే ఇలా ఎక్కువమంది ఒంటరి జీవితం గడుపుతున్నారు. ఇలా గడుపుతున్నవారిలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ నగ్మా కూడా ఉన్నారు.
స్టార్ హీరోయిన్ గా రాణించింది
తెలుగు, తమిళంలో రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, సుమన్ తదితర హీరోల సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత భోజ్ పురి సినిమాల్లో కూడా స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఆ తర్వాత సినిమాలకు క్రమేపీ దూరం జరిగి రాజకీయాల్లోకి ప్రవేశించింది. ఇన్ని సంవత్సరాల్లో కూడా ఆమె ఒంటరిగానే జీవించిందికానీ వివాహం చేసుకోలేదు. 49 సంవత్సరాల వయసులో ఉన్నప్పటికీ పెళ్లివైపు మొగ్గుచూపలేదు. కొందరితో మాత్రం సహజీవనం చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ అవేవీ పెళ్లిపీటల వరకు వెళ్లలేదు.

మంచి నిర్ణయం తీసుకుంది
ప్రస్తుతం నగ్మా వివాహానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఓ బాలీవుడ్ హీరోతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న నగ్మా ఈ బాలీవుడ్ హీరోను వివాహమాడబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే వార్త వైరలవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంచెం వయసు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు తోడు కావాలని కోరుకుంటారని, ఈ కోవలోనే నగ్మా కూడా పెళ్లి చేసుకుందామనుకుంటోందని, అందులో తప్పేంలేదని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఇప్పటివరకు ఒంటరిగానే జీవించావు కాబట్టి ఇకముందు కూడా అలాగే ఉంటే మంచిదని సూచిస్తున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం ఎప్పుడో చేసుకోవాల్సిన పెళ్లిని ఇప్పటికే ఆలస్యం చేసుకుందని, ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకుందంటున్నారు.












Click it and Unblock the Notifications