ఈ బాలీవుడ్ స్టార్స్ నెల‌కు క‌రెంట్ బిల్లు ఎంత క‌డతారో తెలుసా..?

సెల‌బ్రిటీల ఖ‌ర్చులు మాములుగా ఉండ‌వు. వారు చిన్న చిన్న వాటికే చాలా మొత్తంలో ఖ‌ర్చుపెడుతుంటారు. వారు తాగే నీటి నుంచి అన్నీ బ్రాండ్ అయ్యి ఉంటాయి. అందులోనూ బాలీవుడ్ సెల‌బ్రిటీల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ల‌గ్జీరీ కార్లు, ల‌గ్జ‌రీ ఇళ్లు.. ఒక్క‌టేమిటీ..బాలీవుడ్‌లో ఉండే ప్రతి ఒక్క స్టార్స్ ల‌గ్జ‌రీ ఇళ్ల‌లోనే నివ‌సిస్తుంటారు. అలాంటిది అంత పెద్ద పెద్ద ల‌గ్జ‌రీ ఇళ్ల‌కు వాళ్లు నెల‌కు ఎంత క‌రెంట్ బిల్లు చెల్లిస్తారో ఎప్పుడైనా తెలుసుకోవాల‌నిపించిందా..? మ‌రెందుకాల‌స్యం ఇప్ప‌డు తెలుసుకుందామా..?

బాలీవుడ్ సెల‌బ్రీటీలు ఎప్పుడూ విలాస‌వంత‌మైన ల‌గ్జ‌రీ జీవితాన్ని గ‌డుపుతారు. బాలీవుడ్‌లోని సెల‌బ్రిటీలు వారి ఖ‌రీదైన ఇంటికి నెల‌కు ఎంత క‌రెంటు బిల్లు క‌డ‌తారో తెలుసుకుందాం ప‌దండి.

These Bollywood stars monthly current bill See for yourself

కింగ్ ఖాన్ షారూక్‌..

బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ విలాసవంత‌మైన ల‌గ్జ‌రీ జీవితం గ‌డ‌ప‌డంతో పాటు నెల‌కు భారీ మొత్తంలో క‌రెంటు బిల్లు చెల్లిస్తున్నారు. అంతేకాదు, బాలీవుడ్ సెల‌బ్రిటీలంద‌రిలో షారూక్ ఖానే ఎక్కువ మొత్తంలో క‌రెంట్ బిల్లు క‌డుతున్నారు. షారూక్ ఖాన్ ముంబయిలోని మ‌న్న‌త్‌లో త‌న కుటుంబంతో పాటు నివ‌సిస్తున్నారు. ఆయ‌న నెల‌కు 43నుంచి 45 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను క‌రెంట్ బిల్లు చెల్లిస్తున్నార‌ట‌..

సైఫ్ ఆలీఖాన్‌, కరీనాక‌పూర్‌..

బాలీవుడ్‌లో ఫేమ‌స్ క‌పుల్ ఎవ‌రూ అంటే సైఫ్ ఆలీఖాన్‌, క‌రీనా క‌పూర్ పేర్లే వినిపిస్తాయి. సైఫ్ ఆలీఖాన్ ఇటీవ‌ల తెలుగు సినిమా ప్రాజెక్టుల‌తో ఫుల్ బిజిగా ఉంటున్నారు. సైఫ్, క‌రీనాక‌పూర్‌కు ఇద్ద‌రు పిల్లలు. వారు త‌మ ఇద్ద‌రూ పిల్ల‌ల‌తో క‌లిసి ముంబ‌యిలో నివాస‌ముంటున్నారు. బాంద్రాలోని ఫార్చూన్ హైట్స్‌లో వీరి నివాసం ఉంది. ఈ నివాసానికి వీరూ నెలకు అక్ష‌రాల రూ. 30నుంచి 32 ల‌క్ష‌ల క‌రెంటుబిల్లు చెల్లిస్తున్నారు.

స‌ల్మాన్‌ఖాన్‌..

బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ ముంబ‌యిలోని గెలాక్సీ అపార్టుమెంట్‌లో తన ఫ్యామిలీతో క‌లిసి ఉంటున్నారు. ఈయ‌న ఈ ఇంటికోసం నెల‌కు 23 నుంచి 25ల‌క్ష‌ల రూపాయల క‌రెంటు బిల్లును క‌డుతున్నారు.

బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్‌..

బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్ తన కుటుంబంతో క‌లిసి ముంబ‌యిలోని జ‌ల్సా బంగ్లాలో నివ‌సిస్తున్నారు. వీరు నెల‌కు 22నుంచి 25 లక్ష‌ల రూపాయ‌ల కరెంటు బిల్లును చెల్లిస్తున్నారు.

దీపికా ప‌దుకుణే, ర‌ణ‌వీర్ సింగ్‌..

బాలీవుడ్ స్టార్ క‌పుల్ అన‌గానే ట‌క్కున గుర్తొచ్చే పేరు దీపికా ప‌దుకుణే, ర‌ణ‌వీర్ సింగ్‌. వీరిద్ద‌రూ ముంబ‌యిలోని బ్యూమోండే ట‌వ‌ర్స్‌లో ఉంటున్నారు. వీరు ఈ ఇంటికోసం నెల‌కు రూ. 13నుంచి 15 ల‌క్ష‌ల క‌రెంటు బిల్లు చెల్లిస్తున్నారు.

క‌త్రీనాకైఫ్‌, విక్కి కౌశల్‌

బాలీవుడ్ న‌టి క‌త్రీనాకైఫ్, విక్కి కౌశ‌ల్ ముంబయిలోని 4బిహెచ్‌కె అపార్టుమెంట్‌లో నివ‌సిస్తున్నారు. వీరు నెల‌కు రూ. 8నుంచి 10ల‌క్ష‌ల క‌రెంట్ బిల్లు చెల్లిస్తున్నారు.

అమీర్‌ఖాన్‌

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ త‌న కుటుంబంతో క‌లిసి ముంబ‌యిలో నివ‌సిస్తున్నారు. అంద‌రీతో పోలీస్టే ఈ స్టార్ క‌రెంటు బిల్లు కాస్త త‌క్కువే అని చెప్పుకోవ‌చ్చు. అమీర్‌ఖాన్ నెల‌కు రూ. 9 నుంచి 11ల‌క్ష‌ల రూపాయ‌ల కరెంటు బిల్లును క‌డుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+