ఒరేయ్ ఎవర్రా మీరంతా..? ఇంత పెద్ద హిట్టు కొట్టారేంట్రా..!!

ఈ రోజుల్లో చిన్న సినిమాలదే హవా.. భారీ బడ్జెట్ వచ్చినా.. పెద్ద హిరో సినిమా అయినా కంటెంట్ లేకపోతే పక్కన పెట్టేస్తున్నారు సినీ ప్రేక్షకులు. అలాగే కొత్త నటులు తీసిన సినిమా అయినా.. వాళ్ల ముఖాలు ఇప్పటి వరకూ తెలియకపోయినా.. కథ నచ్చితే చాలు బ్లాక్ బస్టర్ హిట్టు చేసేస్తున్నారు. కంటెంట్ ఉన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. గతేడాది చాలా చిన్న సినిమాలు ఇదే తరహాలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అందులో లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి సినిమాలు మాత్రమే కాదు ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి.

అలాగే ఈ ఏడాది కూడా తిమ్మరాజుపల్లి టీవీ అనే సినిమా రిలీజైంది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 17న ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ సినిమాలో నటించినవారంతా కొత్తవాళ్లే కావడం విశేషం. సినిమాలోని దాదాపు 50 మంది ఆర్టిస్టులకు ఇదే తొలి సినిమా.. విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో పీరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని విపరీతంగా అలరిస్తోంది. ఈ సినిమాలో నూతన నటీనటులు సాయితేజ్‌, వేదా జలంధర్‌ జంటగా నటించారు. మూవీ టైటిల్ తో ఆసక్తి పెంచింది చిత్ర యూనిట్.

తిమ్మరాజుపల్లి టీవీ సినిమాను టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మించడం విశేషం. పూర్తిగా నూతన నటీనటులతో వి. మునిరాజును దర్శకుడిగా పరిచయం చేస్తూ కిరణ్ అబ్బవరం పెద్ద సాహసమే చేశాడు. కానీ ఆయన నమ్మిన కథను ఇప్పుడు ప్రేక్షకులు కూడా ఆదరిస్తుండటం విశేషం. ఆడియన్స్ కు కనెక్ట్ అయితే అది చిన్న సినిమానా.. లేక పెద్ద సినిమానా.. అని చూడరని మరోసారి రుజువు చేసింది తిమ్మరాజుపల్లి టీవీ సినిమా.

ThimmarajupalliTV Cinema Earns Huge on Day 1 Small Budget Film Delivers Sensational Collections

ఈ మూవీ పూర్తిగా తిమ్మరాజుపల్లి అనే గ్రామంలో సాగుతుంది. ఈ గ్రామంలోని ప్రజలుగా నటించిన దాదాపు 50 మంది ఆర్టిస్టులు అంతా కొత్తవారే. ఇక ఈ మూవీ నైజాం రైట్స్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకోవడం విశేషం. ఈ రైట్స్ ను ఆయను రూ. కోటి పెట్టి కొనుగోలు చేసుకున్నారు. ఇక ఓవర్సీస్, తెలుగు రాష్ట్రాలు కలిపి ఈ సినిమాకు రూ. 3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ. 3.5 కోట్లు అవసరం. అంటే రూ. 6 కోట్ల గ్రాస్ అవసరం అని తెలుస్తోంది. అయితే తొలిరోజు సినిమాకు డీసెంట్ గా కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఫస్ట్ డే ఏకంగా రూ.3 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. కొత్త నటీనటులతో తీసిన ఈ సినిమాకు ఈ రేంజ్ ఓపెనింగ్స్ రావడం విశేషం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. వీకెండ్ లో కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+