తమన్నాకు ఏమైంది.. ఇలా అయిపోయిందేంటి

హీరోయిన్ తమన్నా అందం రోజు రోజుకు పెరుగుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల ఫుల్ గ్లామర్ ట్రీట్‌తో ఈ పాల బుగ్గల సుందరి అదరగొడుతోంది. ఆమె తెలుగు సినిమాల్లో కనిపించి చాలాకాలం అయినప్పటికి తెలుగు స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో తమన్నా పేరు ఇప్పటికి టాప్‌లోనే ఉంటోంది. తమన్నా క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు కావస్తోన్న తమన్నాలో ఎటువంటి మార్పు లేదు.

తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నటించిన తమన్నా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ముఖ్యంగా తమన్నా తెలుగు సినిమాల ద్వారానే బాగా ఫేమస్ అయింది. తెలుగు స్టార్ హీరోల అందరితోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమన్నా ప్రస్తుతం సినిమాల కన్నా వెబ్ సరీస్‌ల్లోనే ఎక్కువుగా నటిస్తోంది. తన తోటి హీరోయిన్లు కాజల్, నయనతార, రకుల్, సమంత వంటి వారంతా పెళ్లి చేసుకోగా, తమన్నా మాత్రం ఇంకా సినిమాల్లో నటిస్తునే ఉంది.

Thin Tamannaah s photos goes viral

ఆ మధ్య తమన్నాకు ఆఫర్లు తగ్గినప్పటికీ తిరిగి పుంజుకుని వరుస సినిమాల్లో నటిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలతో పాటు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీగా హీరోయిన్‌గా మారిపోయింది. తమన్నా ఇటీవల కొన్ని ఐటం సాంగ్స్‌ చేసింది. జైలర్, స్త్రీ2 వంటి సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్‌లో తన డ్యాన్స్, ఫిజిక్‌తో కుర్రకారుకు చెమటలు పట్టించింది. ఇదిలా ఉంటే తమన్నా వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లో నిలిచింది.

తమన్నా మొన్నటి వరకు గాఢమైన ప్రేమలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది.వీరు కలిసి 'లస్ట్ స్టోరీస్ 2'సినిమాలో నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.2022 నుంచి వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. వీరిద్దరి వ్యవహారం గురించి బాలీవుడ్ మీడియాలో చాలా కథనాలు వెలువడ్డాయి. ఇక పెళ్లే అనుకున్న తరుణంలో ప్రియుడు వర్మకు షాకిచ్చింది తమన్నా. ప్రియుడు వర్మకు సంబంధించిన ఫొటోలు,వీడియోలను మిల్కీ బ్యూటీ డిలీట్ చేసింది.తమన్నా, విజయ్ వర్మల మధ్య అభిప్రాయభేదాలు రావడంతోనే వీరు విడిపోయారని అనుకున్నారు. దీంతో తమన్నా, విజయ్ వర్మల బంధం మధ్యలోనే ముగిసిపోయిందని అంతా భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే తమన్నా తాజాగా తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. గతంలో బొద్దుగా కనిపించిన తమన్నా, ప్రస్తుతం షేర్ చేసిన ఫొటోల్లో సన్నగా కనిపించింది. ఇంకా చెప్పాలంటే బక్కగా దర్శనం ఇచ్చింది. తమన్నా సన్నపడటంతో తమన్నా ఫేస్‌లో కూడా మార్పులు కనిపించాయి. దీంతో తమన్నాకు ఏమైందని ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం తమన్నా షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+