రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' కంటే ఇదే బాగుంది.. తమన్ షాకింగ్ కామెంట్స్
స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన చిత్రం గేమ్ ఛేంజర్. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులను అలరించలేకపోయింది. నాలుగు సంవత్సరాల పాటు ఈ మూవీని షూటింగ్ చేసి.. ఆడియన్స్ ని మెప్పించలేకపోయారని గట్టిగానే ట్రోల్స్ వచ్చాయి. ముఖ్యంగా సినిమాలోని కొన్ని సీన్లు, సాంగ్స్ విషయంలో విమర్శలు వస్తున్నాయి.
అంతే కాకుండా ఈ చిత్రంలోని 'జరగండి..జరగండి' పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమా విషయానికి వచ్చేలోపు చెత్త స్టెప్పులను కంపోజ్ చేసారంటూ కామెంట్స్ వచ్చాయి. ఈ పాటకు కొరియోగ్రాఫర్ గా చేసింది నిజంగా ప్రభుదేవా మాస్టర్ ఏనా.. లేక మరెవరైనా అనే డౌట్ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సైతం ఈ సాంగ్ లోని స్టెప్స్ పై దారుణంగా వ్యాఖ్యానించారు.

ఓంకార్ నేతృత్వంలో ఆహా ఓటీటీలో 'డ్యాన్స్ ఐకాన్ 2' షో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ కార్యక్రమానికి తమన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కంటెస్టెంట్స్ అందరూ తమన్ కంపోజ్ చేసిన సాంగ్స్ కి డ్యాన్స్ వేశారు. వాటిలో 'గేమ్ చేంజర్' నుండి 'జరగండి..జరగండి' పాటకు ఒక చిన్న అమ్మాయి డ్యాన్స్ వేసింది. ఆ అమ్మాయి డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ని చూసిన తమన్, అద్భుతంగా డ్యాన్స్ వేశావు, ఒరిజినల్ పాటలోని స్టెప్పుల కంటే ఇందులోనే బాగున్నాయి, ఇలాంటి స్టెప్పులు ఒరిజినల్ సాంగ్ లో కంపోజ్ చేసి ఉండుంటే అదిరిపోయేది అంటూ చెప్పుకొచ్చాడు.
దీంతో తాను పని చేసిన సినిమాపై తానే కామెంట్స్ చేయడం ఒక్క గేమ్ ఛేంజర్ మూవీకి చెల్లింది అంటూ నెటిజన్లు సైతం మరోసారి విమర్శలు గుప్పిస్తున్నారు. తమన్ ప్రభుదేవా మాస్టర్ ని మాత్రమే కాదు, రామ్ చరణ్ ని కూడా అవమానించారని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ మూవీగా దాదాపు రూ.300కోట్లకు పైగా బడ్జెట్‍తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో కియారా హీరోయిన్ గా నటించగా.. అంజలి, ఎస్‍జే సూర్య, శ్రీకాంత్, సునీల్, సముద్రఖని, జయరాం కీలకపాత్రలు పోషించారు.












Click it and Unblock the Notifications