ఆ సినిమా చేయనని చెప్పి త్రుటిలో పెను ప్రమాదాన్ని తప్పించుకున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీనికి ముందు వశిష్ట దర్శకత్వంలో చేసి విశ్వంభర చిత్రం గ్రాఫిక్ వర్క్ జరుపుకుంటోంది. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే విషయంలో ఎవరికీ స్పష్టత లేదు. అసలు విడుదలవుతుందా? లేదంటే విడుదల కాని చిరంజీవి సినిమాల జాబితాలో ఇది కూడా చేరిపోతుందా? అనే అనుమానం మెగా అభిమానుల్లో కూడా వ్యక్తమవుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి మాత్రం అనిల్ రావిపూడితో చేసే సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు.

భారీ అంచనాల మధ్య విడుదలై..
చిరంజీవి కెరీర్ లో ఎన్నో సినిమాలను తిరస్కరించారు. కొన్నిసార్లు కాల్షీట్లు ఖాళీ లేకపోవడం, మరికొన్ని సార్లు కథ నచ్చకపోవడంలాంటి కారణాలతో చాలా సినిమాలను వదులుకున్నారు. అయితే ఇటీవల ఓ భారీ ఫ్లాప్ సినిమాను త్రుటిలో తప్పించుకున్నారు. లేదంటే చిరంజీవి ఖాతాలో భోళాశంకర్ లాగే మరో భారీ డిజాస్టర్ పడేది. ఆ సినిమా ఏదంటే టైగర్ నాగేశ్వరరావు. స్టువర్టుపురం ప్రాంతానికి చెందిన నాగేశ్వరరావు అనే దొంగ నిజ జీవితాన్ని ఆధారంగా చేసుకొని కొత్త దర్శకుడు వంశీ ఈ సినిమాను రవితేజతో తెరకెక్కించారు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన టైగర్ నాగేశ్వరరావు అట్టర్ ఫ్లాప్ అయింది. దర్శకుడు వంశీ కథను ముందుకుగా చిరంజీవి దగ్గరకే తీసుకువెళ్లాడు.

Tiger Nageswara Rao Movie Initially Rejected By Chiranjeevi

అంతిమంగా వద్దని చెప్పారు
అయితే ఎందుకనో చిరంజీవికి కథ నచ్చలేదు. స్క్రిప్ట్ కూడా నచ్చలేదు. కొన్ని మార్పుచేర్పుల తర్వాతైనా చేద్దామనుకున్నప్పటికీ అంతిమంగా ఆ సినిమాను మాత్రం తిరస్కరించేశారు. దీంతో రవితేజ ఓకే చెప్పడంతో వెంటనే ఈ సినిమా పట్టాలెక్కింది. మొదటిరోజు మొదటి ఆటకే ఫ్లాప్ టాక్ మూటకట్టుకుంది. రవితేజ ఫ్లాప్ సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా చేరిపోయింది. అలా చిరంజీవి పెద్ద ప్రమాదాన్ని తప్పించుకున్నాడని ఫిలింనగర్ వర్గాలు అంటుంటాడు. ఒకవేళ చిరంజీవి ఈ సినిమా చేసుంటే అతని కెరీర్ లో ఇది కూడా ఓ మాయని మచ్చలా మిగిలిపోయేదని, చిరు తర్వాత సినిమాను కొనుగోలు చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు కూడా ముందుకు వచ్చేవారు కారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+