పహల్గామ్ వెళ్లిన టాలీవుడ్ స్టార్- ఈ పరిస్థితుల్లో అక్కడికి వెళ్లడమంటే..!!

పహల్గామ్.. జమ్మూ కాశ్మీర్ లో ఎత్తయిన మంచుకొండల మధ్య ఉండే పర్యాటక ప్రదేశం. ఇప్పట్లో ఎవరూ మరిచిపోలేని పేరు ఇది. ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన ఇక్కడ చోటు చేసుకున్న ఊచకోత.. ఓ పీడకల. పాకిస్తాన్ ప్రోత్సాహిత ఉగ్రవాదులు మారణహోమాన్ని జరిపిందిక్కడే. విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు. వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపారు.

దీని తరువాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆపరేషన్ సింధూర్ చేపట్టింది.. భారత్. పాకిస్తాన్ పీచమణిచింది. పాకిస్తాన్ భూభాగంపైకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో మెరుపుదాడులను నిర్వహించింది. పహల్గామ్ ఊచకోతకు ప్రతీకారాన్ని తీర్చుకుంది. లష్కరే తొయిబా, జైషె మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి కరడుగట్టిన ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం అయ్యాయి.

Tollywood actor Explores the Beauty of Pahalgam

అక్కడితో ఆగలేదు- ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ వేదికల మీదా పాకిస్తాన్ పరువు తీసింది. దాని ప్రకంపనలు ఈరోజు వరకూ కొనసాగుతున్నాయంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికంతటికి కేంద్రబిందువు అయిన పహల్గామ్.. ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. కాల్పుల ఉదంతం జరిగిన ప్రాంతాన్ని తిలకించడానికి, అమరులకు నివాళి అర్పించడానికి పహల్గామ్ వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఈ క్రమంలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ.. పహల్గామ్ వెళ్లారు. రెండు రోజుల కిందటే ఆయన ఢిల్లీ వెళ్లారు. అక్కడి శ్రీనగర్ మీదుగా పహల్గామ్ చేరుకున్నారు. అక్కడే బస చేశారు. ఆ ప్రాంతానికి సంంబంధించిన రెండు ఫొటోలను షేర్ చేశారు. గుడ్ మార్నింగ్ పహల్గామ్ అంటూ వాటిని తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఓ హోటల్, అలాగే- ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ప్రదేశం- బైసారన్ వ్యాలీ ఇందులో ఉన్నాయి.

ఆ ఘటన తర్వాత పహల్గామ్ కు సందర్శకుల తాకిడి తగ్గింది. దాదాపుగా మూడు నెలల పాటు పహల్గామ్ లో పర్యాటకుల సందడి కనిపించలేదు. ఇప్పుడక్కడి పరిస్థితులు పూర్తిగా కుదుటపడ్డాయి. మళ్లీ సందర్శకులు ఆ స్వర్గధామాన్ని సందర్శించడానికి బారులు తీరుతున్నారు. చలికాలంలో పర్యాటకుల రద్దీ మరింత అధికంగా ఉండబోతోంది. మంచుదుప్పటికి కప్పుకొన్న పహల్గామ్ పర్వతాలను తిలకించడానికి మొగ్గు చూపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+