ప్రేమలో పడిన తెలుగు క్రేజీ హీరో, హీరోయిన్!
చలనచిత్ర పరిశ్రమ అన్న తర్వాత హీరో, హీరోయిన్లు ప్రేమలో పడటం అనేది సహజంగా జరుగుతుంటుంది. కొన్నాళ్లు ఎవరికీ తెలియకుండా ప్రేమించుకుంటారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. మరికొన్ని రోజులు గడిచిన తర్వాత మనస్పర్థలు వచ్చాయంటూ విడిపోతారు. ఆ తర్వాత రెండో పెళ్లికి సిద్ధపడతారు. ఇవన్నీ చాలా సాధారణంగా జరిగిపోతుండే సంఘటనలు. మరికొందరు మాత్రం ఒకసారి ప్రేమించిన తర్వాత జీవితకాలం కలిసిమెలిసి జీవించారు. అటువంటివారు తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది ఉన్నారు. ప్రస్తుతం తరం మారడంతో ఎవరూ పట్టుమని నాలుగు నెలలు కూడా కాపురం చేయడంలేదు. మరికొన్ని జంటలైతే వారి ప్రేమను పెళ్లి వరకు తీసుకురాలేకపోతున్నారు.
మంచి తెలివిగల హీరోయిన్
తెలుగులో ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న హీరో ఒకరు ఓ హీరోయిన్ తో ప్రేమలో పడ్డారు. ఆమె కూడా చాలా మంచి సినిమాలు చేసింది. సదరు హీరో కూడా భవిష్యత్తులో స్టార్ హీరోగా స్థిరపడటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. స్టార్ హీరో అయ్యే అవకాశం కూడా ఉంది. చాలా సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతాడు. అలాగే ఆ హీరోయిన్ పరిశ్రమలో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. చాలా తెలివితేటలు కలది. ఎవరిని ఎంతవరకు దగ్గరకు రానివ్వాలో అంతవరకే రానిస్తుంది. ఎంతో హుషారుగా ఉంటుంది. ఎంతో అందంగా ఉండే ఈ హీరోయిన్ మీద ఇప్పటివరకు తెలుగు పరిశ్రమలో ఎటువంటి పుకార్లు రాలేదు. కెరీర్ ను నిలబెట్టుకోవడానికి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.

భవిష్యత్తులో వివాహం చేసుకోబోతున్నారు
ప్రస్తుతం ఈ హీరో, హీరోయిన్లిద్దరూ ఎంతో స్నేహంగా ఉంటారు. మంచి స్నేహితులని పరిశ్రమలో పేరుంది. భవిష్యత్తులో ఈ స్నేహితులిద్దరూ ప్రేమికులుగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని, వివాహం కూడా చేసుకుంటారని అంటున్నారు. వీరిద్దరిదీ వయసు కూడా చాలా పెద్దేదం కాదని, చిన్న వయసే అని, అలాగే పెళ్లికన్నా కెరీర్ లో చాలాదూరం ప్రయాణించాల్సి ఉందనే అభిప్రాయాన్ని ఇద్దరూ వ్యక్తం చేస్తున్నారు. వీరి ప్రేమ పెళ్లిపీటల వరకు వెళుతుందేమో చూడాలంటున్నారు. మొత్తానికి పరిశ్రమలో రాణిస్తున్న హీరో హీరోయిన్లిద్దరూ త్వరలో ఓ ఇంటివారైతే అందరూ సంతోషిస్తారు. వారెవరు అనేది మాత్రం నెటిజన్లు రకరకాల పేర్లు పెడుతూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. త్వరలోనే వారిద్దరిపై ఓ స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications