హీరోలకన్నా ఎక్కువ సంపాదిస్తున్న వారి భార్యలు
మన తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు వ్యాపార రంగంలో కూడా రాణిస్తూ కోట్లరూపాయల ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు. వీరికి తోడుగా వీరి భార్యలు కూడా విభిన్న రంగాల్లో తమ ప్రతిభను చూపిస్తూ వారూ.. కోట్లరూపాయలను సంపాదిస్తున్నారు. మన హీరోల్లో మహేష్ బాబు, నాగార్జున, అల్లు అర్జున్, రామ్ చరణ్, మోహన్ బాబు, విజయ్ దేవరకొండ, రానా.. తదితర హీరోలు వ్యాపారాలు చేస్తున్నారు. ఎవరెవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసుకుందాం.
నమ్రతా శిరోద్కర్:వివాహమైన తర్వాత కుటుంబానికే పరిమితమైంది. మహేష్ బాబు కమర్షియల్ బ్రాండింగ్ వ్యవహారాలను చూసుకోవడమే కాకుండా... ఏఎంబి సినిమాలతో పాటు టెక్స్ టైల్స్, ఫుడ్ బిజినెస్ లో పెట్టిన పెట్టుబడులను ఆమే చూసుకుంటోంది. సంవత్సరానికి వీరి టర్నోవర్ కొన్ని కోట్లరూపాయల్లో ఉంటున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు కూతురు సితార కూడా ఒక జ్యూయలరీ సంస్థకు ప్రచారకర్తగా ఉన్నారు.

ఉపాసన:దేశంలోనే అతిపెద్ద గ్రూప్ హాస్పిటల్స్ లో ఒకటి అపోలో. దీనికి డైరెక్టర్స్ లో ఒకరైన ఉపాసన రామ్ చరణ్ ని పెళ్లి చేసుకుంది. దీంతోపాటు ఎయిర్ లైన్స్ బిజినెస్, యువర్ లైఫ్ అనే హెల్త్ మ్యాగజైన్, వెబ్ సైట్ బాధ్యతలను చూస్తోంది. వీరి టర్నోవర్ కూడా సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయల్లో ఉంటోంది.
అల్లు స్నేహ:అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి ప్రతిరోజు సోషల్ మీడియాలో అప్డేట్స్ ని ఇస్తుంటుంది. అల్లు అర్జున్ మామ రాజకీయ నాయకుడు. ఈయన స్థాపించిన సెయింట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ గా ఉన్న స్నేహ.. ఓ ఫోటో స్టూడియోను సైతం నిర్వహిస్తున్నారు. తమకి ఇష్టమైన రంగాల్లో కొనసాగుతూ భర్తకి చేదోడు వాదుడుగా నిలుస్తున్న వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలని సినీ ప్రేమికులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications