ఇదేందయ్యా ఇదీ.. తాను తీసిన సినిమా చూస్తూ గుండెపోటుతో టాలీవుడ్ డైరెక్టర్ మృతి

మృత్యువు ఎప్పుడు ఎవర్ని ఎలా కబళిస్తుందో తెలియదు. ఆ డైరెక్టర్ ఎంతో కష్టపడి ఏళ్లపాటు కృషి చేసి సినిమాను తీశాడు. ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని బలంగా నమ్మాడు. మరి కొద్ది రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో ఆ మూవీని ప్రివ్యూ వేశారు. ఆ మూవీ ప్రివ్యూ చూస్తుండగా గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. అయితే తెలుగు సినిమాని విషాదంలోకి నెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

టాలీవుడ్ కు చెందిన ఓ డైరెక్టర్ తన కలల ప్రపంచాన్ని తెరమీద చూడకుండానే మృతి చెందాడు. ఎంతో కష్టపడి.. ఏళ్లపాటు శ్రమించి ఎట్టకేలకు రిలీజ్ వరకూ తీసుకొచ్చాడు. సినిమా రిలీజ్ కు ముందు ప్రివ్యూ వేశాడు. ఆ ప్రివ్యూ చూస్తూ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతి చెందాడు. టాలీవుడ్ లో జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

టాలీవుడ్ దర్శకుడు సండ్రు నాగేష్ అలియాస్ రాంబాబు (47) దర్శకత్వంలో 'బ్రహ్మాండ' అనే మూవీ తెరకెక్కింది. ఈ మూవీ ప్రివ్యూ చూస్తుండగా రాంబాబు ఒక్కసారిగా బ్రెయిన్ స్ట్రోక్‌ తో కుప్పకూలిపోయాడు. ఈ మూవీ మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఇలాంటి ఘోరం జరిగిపోవడంతో చిత్ర యూనిట్ తో టాలీవుడ్ పరిశ్రమ విషాదంలో ఉంది.

Tollywood Mourns Director Rambabu Dies of Brain Stroke at Brahmanda Preview

రాంబాబు దర్శకత్వంలో రానున్న తొలి సినిమా బ్రహ్మాండ. కానీ ఈ మూవీ రిలీజ్ కాకుండానే ఆయన మృతి చెందారు. రాంబాబు గతంలో దాదాపు 150 సినిమాలు, 60 టీవీ సీరియల్స్‌కు కో-డైరెక్టర్‌ గా పనిచేశారు. అంతరంగాలు, అన్వేషణ.. లాంటి షోలకు ఆయన కీలకంగా పనిచేశారు. ఇక ఇవాళ ఆయన అంత్యక్రియలు స్వగ్రామమైన అల్లీపూర్ లో పూర్తయ్యాయి.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. సీనియర్ నటి ఆమని ప్రధాన పాత్రలో తెలంగాణ జానపద కళారూపమైన ఒగ్గుకథ నేపథ్యంలో "బ్రహ్మాండ" చిత్రం రూపొందింది. దర్శకుడు రాంబాబు.. ఏళ్లపాటు అధ్యయనం చేసి ఈ కథను సిద్ధం చేసుకున్నారు. జూలై 18న సినిమా విడుదల కానుంది. ఇంతలోనే డైరెక్టర్ మృతి చెందడంతో చిత్ర యూనిట్ శోక సంద్రంలో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+