రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్మెంట్ పిక్స్ వైరల్.. అమ్మాయి ఎవరంటే..?
ప్రముఖ సింగ్ "రాహుల్ సిప్లిగంజ్" గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ప్లే బ్యాక్ సింగర్‌గా తన కెరీర్‌ను ఆరంభించిన రాహుల్.. అనేక సినిమాల్లో సూపర్ హిట్ పాటలను ఆలపించడమే కాకుండా.. ప్రైవేట్ సాంగ్స్ తో కూడా ఫుల్ ఫేమస్ అయ్యారు. సినిమా పాటలతో పాటు బుల్లితెరపై ప్రసారమయ్యే పలు స్పెషల్ ఈవెంట్లలో, స్టేజ్ షోలలో తరచుగా సందడి చేస్తూ తనకంటూ అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ షోలో పాల్గొని విన్నర్ అవ్వడంతో మరింత పాపులర్ అయ్యాడు.
ఆస్కార్ అవార్డు..
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీలోని "నాటు నాటు" పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు రాహుల్. ఆ పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో రాహుల్ ఒక్కసారిగా ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిపోయాడు. ఈ క్రమంలోనే రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయనను కోటి రూపాయలు నగదు బహుమతిగా ఇచ్చి సత్కరించింది.

ఇక ఇటీవలి కాలంలో రాహుల్ వ్యక్తిగత జీవితం గురించి పలు రకాల గాసిప్స్ మీడియాలో, సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కొంతమందితో ప్రేమాయణం నడిపాడని కూడా వార్తలు వచ్చాయి. ముఖ్యంగా బిగ్ బాస్ ఫేమ్ రతిక రోజ్‌తో కలిసి దిగిన ఫోటోలు వైరల్ కావడంతో అప్పట్లో ఫుల్ టాక్ నడిచింది. అయితే ఇప్పుడు అన్ని రకాల రూమర్స్‌కి చెక్ పెడుతూ రాహుల్ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఆదివారం నాడు హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ వేదికలో, అతి కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితులు, కొందరు సినీ మిత్రుల సమక్షంలో రాహుల్ నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ వేడుకకు సైలెంట్ గా నిర్వహించడంతో ఫోటోలు పెద్దగా బయటకు రాలేదు. కానీ పలువురు సోషల్ మీడియా వేదికగా పిక్స్ షేర్ చేసి విషెస్ చెబుతూ పోస్టులు పెట్టడంతో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
అమ్మాయి ఎవరంటే..?
రాహుల్ ఎవరితో నిశ్చితార్థం చేసుకున్నాడో అన్న ప్రశ్నకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. రాహుల్ ఎన్నేళ్లుగా ప్రేమిస్తున్న తన ప్రియురాలు హరిణి రెడ్డితోనే కొత్త జీవితాన్ని మొదలుపెట్టబోతున్నాడు. ఇండస్ట్రీకి సంబంధం లేని ఈమెను కుటుంబ సభ్యుల సమ్మతితో రాహుల్ వివాహం చేసుకోనున్నాడు. ఎంగేజ్మెంట్ వేడుకలో రాహుల్ పాస్టెల్ లావెండర్ షేర్వానీ ధరించగా, హరిణి ఆరెంజ్ లెహంగాలో మెరిసింది.
Singer #RahulSipligunj get engaged 🎊🎊🎊🎉🎉🎉🎉🎉
— Sreedhar Sri (@SreedharSri4u) August 18, 2025
Congratulations anna✨✨✨🎁🎁🎁 pic.twitter.com/8dGqU1DIfF
మొత్తానికి రాహుల్ ఎంగేజ్మెంట్ వార్త బయటకు రావడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ఇప్పటికే సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. రాహుల్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు కూడా ఈ జంటకు విషెస్ పంపుతున్నారు.












Click it and Unblock the Notifications