హీరోలకన్నా వారి భార్యలే ఎక్కువ సంపాదిస్తున్నారు
మన తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలందరి పారితోషికంగా భారీగా ఉంటుంది. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఎవరూ రూ.100 కోట్లకు తక్కువ కాకుండా తీసుకుంటున్నారు. అయితే ఈ స్టార్ హీరోల భార్యలు కూడా భర్తలకు ధీటుగా వ్యాపారాల్లో సంపాదన ఆర్జిస్తున్నారు. విభిన్నరంగాల్లో తమ ప్రతిభను నిరూపించుకున్నారు. మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాని, రానా.. తదితర హీరోల భార్యలంతా చన్నీళ్లకు వేడినీళ్లు తోడన్నట్లుగా భర్త రూ.కోట్లకు వీరు కూడా రూ.కోట్లు కురిపిస్తున్నారు.
మహేష్ బాబు - నమ్రతా శిరోద్కర్
మహేష్ బాబు కమర్షియల్ బ్రాండింగ్ వ్యవహారాలను చూసుకుంటుంది. ఏఎంబి సినిమాలతో పాటు టెక్స్ టైల్స్, ఫుడ్ బిజినెస్ లో పెట్టుబడులు పెట్టింది. వీటి టర్నోవర్ సంవత్సరానికి రూ.కోట్లల్లో ఉంది. కూతురు సితార కూడా ఓ జ్యువెలరీ సంస్థకు ప్రచారకర్తగా ఉన్నారు.

రామ్ చరణ్ - ఉపాసన
దేశంలోనే అతిపెద్ద గ్రూప్ హాస్పిటల్స్ లో ఒకటైన అపోలోకు ఒక డైరెక్టర్ గా ఉపాసన వ్యవహరిస్తున్నారు. హాస్పటల్ తోపాటు ఎయిర్ లైన్స్ బిజినెస్, యువర్ లైఫ్ అనే హెల్త్ మ్యాగజైన్, వెబ్ సైట్ బాధ్యతలను నిర్వర్తిస్తోంది. ఈమె టర్నోవర్ కూడా ఏడాదికి రూ.కోట్లలో ఉంటోంది.

అల్లు అర్జున్ - స్నేహారెడ్డి
అల్లు స్నేహారెడ్డి ప్రతిరోజు సామాజిక మాధ్యమాల్లో అప్డేట్స్ ని ఇస్తుంటుంది. తన తండ్రి స్థాపించిన సెయింట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ గా ఉండటంతోపాటు ఓ ఫోటో స్టూడియోను కూడా నిర్వహిస్తున్నారు. ఓ మ్యాగజైన్ కు ఎడిటర్ గా ఉన్నారు.

నాని - అంజన
వీరికి ఓ కొడుకు ఉన్నాడు. కాస్ట్యూమ్ డిజైనర్ గా బాగా సంపాదించడమేకాదు మంచి క్రేజ్ ను కూడా సొంతం చేసుకున్నారు. ఎటువంటి వివాదాలు లేకుండా సాఫీగా దాంపత్యాన్ని కొనసాగిస్తున్నారు.
అల్లరి నరేష్ భార్య, రానా భార్య, నితిన్ భార్య, రాహుల్ రవీంద్రన్ భార్య, రాజీవ్ కనకాల భార్య సుమ, మంచు మనోజ్ భార్య, మంచు విష్ణు భార్య కూడా భర్తలకన్నా ఎక్కువే సంపాదిస్తున్నారు.












Click it and Unblock the Notifications