తెలుగులో కేవలం ఒక్కరోజే ఆడి రికార్డు సృష్టించిన ఏకైక సినిమా
తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన ఎన్నో సినిమాలు సంవత్సరాల తరబడి ఆడినవి ఉన్నాయి. అలాగే ఫ్లాప్ అయిన సినిమాలు కనీసం రెండువారాలన్నా ఆడేవి. మరీ దారుణంగా ఉన్నా గతంలో నెలరోజులు కూడా ఆడేవి. ఇప్పుడు మాత్రం వారానికే థియేటర్ నుంచి మూటా ముల్లె సర్దుకొని వెళ్లిపోతున్నాయి. అయితే మన తెలుగులో థియేటర్లలో విడుదలై కేవలం ఒకరోజు మాత్రమే ఆడిన సినిమా ఉందని మీకు తెలుసా? మరీ దారుణం కాకపోతే ఒకరోజు ఆడటం అంటే దానివెనక అనేక కారణాలు ఉంటాయి. సినిమా కథ బాగోలేకపోవడం, నటీనటుల నటన బాగుండకపోవడం, దర్శకుడి వైఫల్యం, నిర్మాణ విలువలు బాగుండకపోవడంతోపాటు అనేక కారణాలు ఉంటాయని అందరికీ తెలిసిందే.
నటించినవారెవరో ఎవరికీ తెలియదు
అయితే ఈ సినిమా ఎందుకు ఒకరోజే ఆడిందో తెలుసుకుందాం. ఆ సినిమా పేరు 'గురువారం ముహూర్తం'. ఈ సినిమా గురించి తెలుగు సినీ పరిశ్రమలో తరుచుగా చర్చ జరుగుతుంటుంది. వాస్తవానికి "ఒక్క రోజే ఆడింది" అంటే దాని అర్థం మొదటి రోజే ప్రేక్షకులు ఎవరూ రాకపోవడమో లేదా సినిమా అత్యంత దారుణంగా ఉండటమో కాదు. దీనికి ప్రధానంగా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య కుదిరే ఒప్పందాలు కారణం. ఈ సినిమాలో కిరణ్, ఆర్తి హీరో హీరోయిన్లుగా నటించారు. బండారు సుబ్బారావు దర్శకత్వం వహించారు. బి.భూషణరావు నిర్మించిన ఈ సినిమా 1989లో విడుదలై ఒకరోజే ఆడి సంచలన రికార్డును తన పేరుమీద లిఖించుకుంది.

మొదటి ఆటకే నెగెటివ్ టాక్
ఈ సినిమాకు మొదటి ఆటకే నెగటివ్ టాక్ వచ్చింది. రెండో ఆట నుంచి టికెట్లు అస్సలు తెగలేదు. థియేటర్ల యజమానులు భారీ నష్టాలను తట్టుకోవడానికి తర్వాత రోజు నుంచే 'గురువారం ముహూర్తం' తీసేసి వేరే పాత హిట్టు సినిమాలను ప్రదర్శించారు. ఈ సినిమా కథ కూడా అస్సలు బాగోలేదు. స్క్రీన్ ప్లే ఆకట్టుకోలేదు. ఈ సినిమాలో నటించినవారంతా కొత్తవారే కావడంతో ప్రేక్షకులకు తెలియలేదు. ఇప్పుడున్నంత సోషల్ మీడియా అప్పుడు లేదు. దాంతో అసలు ప్రచారమే జరగలేదు. అటువంటి సమయంలో వేరే పెద్ద హీరో సినిమా విడుదలైతే అందరూ అటువైపు మొగ్గుచూపేవారు. సరిగ్గా ఈ సినిమాకు కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. ప్రస్తుత రోజుల్లో చాలా సినిమాలు విడుదలై మొదటిరోజు మొదటి ఆటకే "డిజాస్టర్" టాక్ తెచ్చుకుని, తర్వాత రోజుకే థియేటర్ల నుంచి మాయమవుతున్నాయి. అయితే, రికార్డు పరంగా మాత్రం 'గురువారం ముహూర్తం' సంచలనం సృష్టించింది.












Click it and Unblock the Notifications