మందమర్రి టు చందమామ: టాలీవుడ్ లో కామెడీ అడ్వెంచర్ ఫిల్మ్
టాలీవుడ్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఓ మూవీ రూపుదిద్దుకుంటోంది. ప్రముఖ దర్శకుడు వేణు ఉడుగుల సమర్పణలో ఈ ఫిల్మ్ తెరకెక్కుతోంది. హిలేరియస్ కామెడీ అడ్వెంచర్ జానర్ ఫిల్మ్ ఇది. వినోదం, సాహసాల సమాహారంగా చిత్రీకరణ జరుపుకొంటోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా మోషన్ పోస్టర్ కూడా విడుదలైంది. గ్యారంటీ హిట్ అవుతుందనే నమ్మకాన్ని చిత్రం యూనిట్ వ్యక్తం చేసింది.
అదే.. 'చంద్రయాన్'. మోషన్ పోస్టర్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. శ్రీనాథ్ చంద్రశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తోన్నారు. ఇది.. ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు మేకర్స్. చంద్రయాన్ అనే టైటిల్ వినగానే దేశభక్తి లేదా సైన్స్ ఫిక్షన్ కథ అనే అభిప్రాయం కలుగుతుంది. అలా అనుకుంటే పొరపాటే. ఇదొక ట్రెండీ, హిలేరియస్ అడ్వెంచర్ రైడ్ అని చిత్రబృందం స్పష్టం చేసింది. ఈ మోషన్ పోస్టర్ లో కనిపించిన మందమర్రి టు చందమామ అనే ప్లకార్డ్ ఆకట్టుకుంది.

రాజు వెండ్స్ రాంబాయి, నీది నాది ఒకే కథ, విరాటపర్వం సినిమాలకు దర్శకత్వం వహించాడు వేణు ఉడుగుల. ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తోన్నారు. అంతరిక్ష ప్రయాణ నేపథ్యంతో కూడిన వినోదాత్మక చిత్రంగా దీనిని తీర్చిదిద్దుతున్నట్లు పోస్టర్ హింట్ ఇస్తోంది. థియేటర్లలో ప్రేక్షకులను థ్రిల్ చేస్తూనే నవ్వించడమే లక్ష్యంగా ఈ సినిమా రూపొందుతోంది. వైవిధ్యమైన చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వేణు ఉడుగుల ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రవీణ్ మొలక ఈ సినిమాను నిర్మిస్తోన్నారు.
X
— v e n u u d u g u l a (@venuudugulafilm) September 4, 2026
GET READY FOR A RIDE THAT'S TRULY OUT OF THIS WORLD! 🌕
Fresh. Crazy. Hilarious. One wild adventure you definitely don’t want to miss! 🔥😎
Here’s #CHANDRAYAAN MOTION POSTER - https://t.co/jaSzqoYBcP
Launching soon at theatres near you! 🚀@venuudugulafilm presents…
ప్రస్తుతం నిర్మాణ పనులను వేగంగా జరుపుకుంటున్న 'చంద్రయాన్' త్వరలోనే థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. మునుపెన్నడూ చూడని ఒక గమ్మత్తైన ప్రయాణాన్ని ప్రేక్షకులకు చూపిస్తామంటూ మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వినూత్నమైన కంటెంట్‌ను ఎప్పుడూ ఆదరించే తెలుగు ప్రేక్షకులు, ఈ స్పేస్ కామెడీ థ్రిల్లర్‌కు ఎలాంటి విజయాన్ని అందిస్తారో చూడాలి. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్, ట్రైలర్ అప్‌డేట్స్ వెల్లడి కానున్నాయి.












Click it and Unblock the Notifications