టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ దీర్ఘకాల ప్రేమ బంధానికి ముగింపు పలుకుతూ కిందటి నెల 26 ఒక్కటయ్యారు. ఉదయపూర్‌లో కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి పీటలు ఎక్కారు. ఈ జంట సాంప్రదాయ తెలుగు, కొడవ ఆచారాల ప్రకారం వివాహం చేసుకుంది. దీని తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ సహా దాదాపుగా సినీ పరిశ్రమ మొత్తం తరలివచ్చిందీ ఫంక్షన్ కు. అనంతరం తమ స్వగ్రామంలో వత్రం నిర్వహించారు. ఊరందరికీ భోజనాలు వడ్డించారు.

ఇప్పుడు మరో స్టార్ హీరో త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోన్నాడు. కొద్దిసేపటి కిందటే ఎంగేజ్మెంట్ కూడా ముగిసింది. ఆ హీరో ఎవరో కాదు- ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. కావ్యారెడ్డిని పెళ్లాడనున్నాడు. ఆమెతో కలిసి కొత్త జీవితం ప్రారంభించనున్నాడు. ఈ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కూడా కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెద్దగా హడావుడి లేకుండా పూర్తయింది. టాలీవుడ్ నుంచి నటి సంయుక్త, దర్శకుడు బోయపాటి శీను, మరికొందరు సెలెబ్రెటీలు హాజరయ్యారు.

Tollywood Young Hero Bellamkonda Sai Sreenivas Got Engaged to Kavya Reddy Today in Private Function

కావ్యరెడ్డి హైదరాబాద్ కు చెందిన వారే. ఆమె కుటుంబానికి ఫిల్మ్ ఇండస్ట్రీతో సంబంధాలు లేవు. తాత రిటైర్డ్ న్యాయమూర్తి, తండ్రి లాయర్ అని సమాచారం. బెల్లం కొండ కుటుంబంతో చాలాకాలం నుంచే పరిచయం ఉందని చెబుతున్నారు. మరి కావ్యతో పరిచయం, ప్రేమ ఎలా అనే విషయాల్ని శ్రీనివాసే బయటపెట్టాలి. వీళ్ల పెళ్లి బహుశా ఈ ఏడాదిలోనే ఉండొచ్చు.

సాయి శ్రీనివాస్. అల్లుడు శ్రీను సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. తొలి చిత్రంలోనే సమంత వంటి స్టార్ హీరోయిన్ సరసన నటించడం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ నడిచిందీ మూవీపై. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అతను నటించిన తాజా చిత్రాలు భైరవం, కిష్కింధపురి. ఈ రెండు కూడా ఫర్వాలేదనిపించుకున్నాయి. మల్టీ స్టారర్ గా తెరకెక్కింది భైరవం. మంచు మనోజ్, నారా రోహిత్ ఇతర కీలక పాత్రలను పోషించారు. కింష్కింధపురి హారర్ జానర్ లో తెరకెక్కింది.

ప్రస్తుతం టైసన్ నాయుడు, హైందవ సినిమాలలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్నాడు. టైసన్ నాయుడు చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. హైందవ సెట్స్ పై ఉంది. నిశ్చితార్థం కోసం ఈ మూవీ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నాడు సాయి శ్రీనివాస్. మరో రెండు ప్రాజెక్టులు అతని చేతిలో ఉన్నాయి. హైంధవ షూటింగ్ పూర్తయ్యాక బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి పెళ్లి ఉండొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+