తెలుగులో టాప్-10 అట్టర్ ఫ్లాప్ మూవీస్

కథ రాసుకొనేటప్పుడు సినిమా బాగా ఆడుతుందనే నమ్మకం రచయితకు, దర్శకుడికి, నిర్మాతకు అందరికీ కలుగుతుంది. అలాగే హీరో, హీరోయిన్లకు కూడా కథ నచ్చుతుంది. దీంతో ఎంతో ఆత్మవిశ్వాసంతో సినిమాను ప్రారంభించి విడుదల చేస్తారు. సినిమా ఎందుకు విజయవంతమవుతుంది? ఎందుకు ఫ్లాప్ అవుతుంది? అనేదానికి ఇంతవరకు కారణాలు లేవు. ప్రేక్షకులు ఎప్పుడు, ఏ మూడ్ లో ఉంటారో తెలియదు. వారి మూడ్ ను బట్టి చెత్త సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి.. బ్లాక్ బస్టర్ గా నిలవాల్సిన సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. కాబట్టి సినిమా విజయం సాధించడం అనేది దైవాధీనంలాంటిది. భగవంతుడు కరుణిస్తే ఆడుతుంది.. లేదంటే అంతే సంగతులు.

భారీ ఫ్లాప్ ను మూటకట్టుకున్నాయి
మన తెలుగు సినీ పరిశ్రమలో టాప్-10లో నిలిచిన భారీ డిజాస్టర్ సినిమాలను ఒకసారి పరిశీలిద్దాం. 2023, 2024 సంవత్సరాలకు సంబంధించి రవితేజ సినిమాలు మూడు, వరుణ్ తేజ్ సినిమాలు మూడు ఈ లిస్టులో ఎక్కువగా ఉన్నాయి. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్, సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రావణాసుర, వంశీ దర్శకత్వంలో వచ్చిన టైగర్ నాగేశ్వరరావు ఘోరమైన డిజాస్టర్లుగా నిలిచాయి. వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించి మట్కా, ఆపరేషన్ వాలెంటైన్, గాండీవధారి అర్జున చిత్రాలు కూడా భారీ ఫ్లాప్ ను మూటకట్టుకున్నాయి.

top 10 heavy disaster movies in telugu film industry

మార్కెట్ లేకుండా పోతుంది జాగ్రత్త!
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేతి నటించి డబుల్ ఇస్మార్ట్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ కథానాయకుడిగా నటించిన ఏజెంట్ చిత్రం ఘోర పరాజయం పాలయ్యాయి. తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించి శాకుంతలం కూడా అడ్రస్ లేకుండా పోయింది. కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ చిత్రానిది కూడా ఇదే పరిస్థితి. కేవలం రెండు సంవత్సరాలకు సంబంధించే ఈ చిత్రాలు టాప్ 10లో నిలిచాయి. ఇంకా భారీ డిజాస్టర్లుగా నిలిచిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. పరిశ్రమలో విజయాల శాతం కూడా చాలా తక్కువగా ఉంది. ఇకనైనా హీరోలు, దర్శకులు జాగ్రత్తగా సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు. అలా కాకుండా పాట, ఫైట్, హీరో డైలాగ్ అంటూ లెక్కలేసుకొని సినిమాలు తీస్తే ఎవరికీ మార్కెట్ లేకుండా పోతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+