తెలుగులో టాప్-10 డిజాస్టర్ మూవీస్
కొన్నాళ్లుగా మన తెలుగు సినీ పరిశ్రమలో ఒక ట్రెండ్ నడుస్తోంది. షూటింగ్ జరుపుకుంటున్న సినిమాకు సంబంధించి విపరీతంగా ప్రచారం చేస్తారు. ఆ సినిమా విడుదలవడానికి ముందు పోస్టర్లు, టీజర్లు, పాటలు ఒక్కొక్కటిగా విడుదల చేసుకుంటూ వచ్చి విపరీతమైన అంచనాలను పెంచేస్తుంటారు. అందుకు తగ్గట్లుగానే స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి గ్లింప్స్ అని, టీజర్ అని, ట్రైలర్ అని... ఇలా విడుదల చేస్తుంటారు. వీటిల్లో చూపించే యాక్షన్ సన్నివేశాలు చూపి ప్రేక్షకులు కూడా అంచనాలు భారీగా పెంచేసుకుంటారు. తీరా సినిమా విడుదలైన తర్వాత థియేటర్ కు వెళితే అరగంటలోపే ఆ థియేటర్ నుంచి బయటకు పరిగెత్తుకుంటూ రావడం జరుగుతోంది. ఇటువంటి అంచనాలను పెంచుకొని విడుదలైన తర్వాత భారీ డిజాస్టర్లుగా నిలిచిన టాప్-10 సినిమాలను ఒకసారి పరిశీలిద్దాం.
* ఈ జాబితాలో ప్రధానంగా చెప్పుకోవాల్సి ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమా. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమలోనే భారీ డిజాస్టర్లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఒకరకంగా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ను ఇది తీవ్రంగా ప్రభావితం చేసింది.
* మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన స్పైడర్ కూడా అంచనాలు అందుకోలేక అందరినీ ముంచేసింది.
* పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన అజ్ఞాతవాసి అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనికి దర్శకుడు.
* అక్కినేని నాగచైతన్య-కాజల్ కాంబినేషన్ లో వచ్చిన దడ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. సినిమా హిట్ అవుతుందని అందరూ భావించగా భారీ ఫ్లాప్ గా నిలచింది.

* విజయ్ దేవరకొండ-రష్మిక నటించిన డియర్ కామ్రేడ్ డిజాస్టర్ ను మూటకట్టుకుంది. భరత్ కమ్మ దీనికి దర్శకుడు.
* బాహుబలి తర్వాత విడుదలయ్యే చిత్రం కావడంతో ప్రభాస్ నటించిన సాహోపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. విడుదలైన తర్వాత ఈ సినిమా ఎవరికీ అర్థంకా అట్టర్ ఫ్లాప్ అయింది. సినిమా తీసిన దర్శకుడినైనా అర్థమైందా? అంటూ అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి.
* నాగార్జున-ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ది ఘోస్ట్ కూడా ఘోర పరాజయం పాలైంది.
* రవితేజ నటించి రావణాసుర సినిమా విడుదలకు ముందు పాత్ర, టీజర్, ట్రైలర్ ఆసక్తిని పెంచాయి. విడుదలైన తర్వాత ఢామ్మని కుప్పకూలిపోయింది.
* అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చి ఏజెంట్ చిత్రం అయితే అంతే సంగతులు. ఇందులో మమ్ముట్టి నటించారు. దీనిపై విడుదలకు ముందు భారీస్థాయిలో అంచనాలున్నాయి. విడుదలైన తర్వాత పరిశ్రమలోని టాప్-10 ఫ్లాప్స్ లో ఒకటిగా నిలిచింది.
* చిరంజీవి-రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఆచార్య సినిమాపై భీభత్సమైన అంచనాలుండేవి. విడుదలైన తర్వాత ఈ సినిమా కూడా తుస్సుమంది.












Click it and Unblock the Notifications