జపాన్ లో కలెక్షన్స్ పరంగా టాప్ 5 ఇండియన్ మూవీస్ ఏవి? 'దేవర' బీట్ చేయగలదా ?
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెబుతూ.. టాలీవుడ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు దర్శకధీరుడు రాజమౌళి. ప్రభాస్ నటించిన బాహుబలితో విదేశాల్లో తెలుగు సినిమాలకు అదిరిపోయే మార్కెట్ క్రియేట్ చేయగలిగారు జక్కన్న. ప్రస్తుతం మన ఇండియన్ సినిమాలకు విదేశాల్లో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా జపాన్ లో మన సినిమాలకు బ్రహ్మరథం పడుతుంటారు.
ముందుగా జపాన్‌లో రజనీకాంత్‌కు ఊహించని క్రేజ్ ఉంది. 1995 సంవత్సరంలో ముత్తు రిలీజై ప్రభంజనం కొనసాగించింది. ముత్తు సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. అప్పటి నుంచి రజనీకి విశేషమైన అభిమానగణం అక్కడ ఏర్పాటైంది. రజనీకాంత్ సినిమా రిలీజైందంటే.. అక్కడ కూడా ఖచ్చితంగా హడావిడి ఉంటుంది. ఆ తర్వాత బాలీవుడ్ హీరోలు బాగా పాపులర్ అయ్యారు. ఇక బాహుబలి తర్వాత నుంచి టాలీవుడ్ హీరోలవంతు వచ్చింది.

ఎంట్రీ ఇవ్వడమే లేట్ అన్నట్టు నాటి నుంచి తెలుగు హీరోలు అక్కడ కలెక్షన్స్ ని కుమ్మేస్తున్నారు. ప్రస్తుతం జపాన్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన టాప్ 5 ఇండియన్ సినిమాల లిస్ట్ పరిశీలిస్తే.. ఆర్ఆర్ఆర్ 2400 మిలియన్ల జపనీస్ డాలర్స్ ని కలెక్ట్ చేసి నెంబర్ 1 స్థానంలో ఉంది. ఆ తర్వాత 305 మిలియన్ డాలర్లతో బాహుబలి2 రెండవ స్థానంలో ఉంది. 131 మిలియన్ డాలర్లతో మగధీర మూడవ స్థానం, 130 మిలియన్ డాలర్లతో మగధీర చిత్రం 4వ స్థానం.. 75 మిలియన్ డాలర్లతో బాహుబలి 5వ స్థానంలో ఉన్నాయి.
RRR సినిమాతో జపాన్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు భారీ క్రేజ్ ఏర్పడింది. రీసెంట్ గానే ఆయన నటించిన రంగస్థలం సినిమా రిలీజ్ అయ్యి 40 మిలియన్ డాలర్లు కలెక్షన్స్ రాబట్టింది. దాంతో ఇప్పుడు ఎన్టీఆర్ కూడా తన 'దేవర' చిత్రాన్ని జపాన్ లో విడుదల చేయడానికి రెడీ అయ్యారు. ఈ నెల 28న దేవర సినిమాను జపాన్ లో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఎన్టీఆర్ సైతం పలు జపాన్ టీవీ చానెల్స్ కి ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నారు.
మరి దేవర చిత్రంతో ఎన్టీఆర్ ఆ రేంజ్ కలెక్షన్స్ సాధిస్తారా.. ఆ సినిమాలను బీట్ చేసి టాప్ లో నిలబడతారా అన్నది చూడాలి. ఇక తెలుగులో దేవర చిత్రం రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం.. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది. అలానే ఎన్టీఆర్ చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. హృతిక్ రోషన్ తో కలిసి 'వార్ 2' మూవీలో నటిస్తున్నారు. ఇది బాలీవుడ్ డెబ్యూ కావడంతో ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications