'టాక్సిక్' టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ఒకే ఒక కండీషన్: ఏపీలో వీడని సస్పెన్స్!

Toxic Movie: స్టార్ హీరో యశ్ కథానాయకుడిగా నటించిన పాన్-ఇండియా సినిమా 'టాక్సిక్'థియేటర్లలోకి రావడానికి కొద్ది గంటల ముందు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల వ్యవహారం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమై భారీ వసూళ్లను సాధించగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం టికెట్ ధరలు, స్పెషల్ షోల అనుమతులు రాక చివరి నిమిషం వరకు బుకింగ్స్ నిలిచిపోయాయి. అయితే థియేట్రికల్ ప్రదర్శనకు కొద్ది గంటల ముందు తెలంగాణ సర్కారు టికెట్ల ధరల పెంపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో టాక్సిక్ కు ఉన్న అతిపెద్ద అడ్డంకి తొలగిపోయింది.

'ఇరుముడి' చైల్డ్ ఆర్టిస్ట్‌కు గోల్డెన్ ఆఫర్!
'ఇరుముడి' చైల్డ్ ఆర్టిస్ట్‌కు గోల్డెన్ ఆఫర్!

తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల ప్రకారం.. ఈ చిత్రం విడుదలైన మొదటి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్సులలో రూ.100 చొప్పున అదనంగా టికెట్ ధరలను పెంచుకోవడానికి నిర్మాతలు జీవో సాధించారు. అయితే ఈ అనుమతికి ఓ ప్రత్యేక షరతును విధించారు. సినిమా ప్రొడ్యూసర్ తెలుగు సినీ కార్మికుల, ఉద్యోగుల సంక్షేమ నిధి ఖాతాకు కోటి రూపాయలను విరాళంగా బదిలీ చేయాలని సర్కారు పేర్కొంది. ఈ జీవో రావడంతో తెలంగాణలో అడ్వాన్స్ బుకింగ్స్ ఊపందుకున్నాయి.

Toxic Movie Ticket Price Hike Telangana Govt Approves with Condition AP Suspense Ongoing Details
రవితేజ 'ఇరుముడి'కి బిగ్ షాక్: ఆ సీన్లు తొలగించాలంటూ డిమాండ్!
రవితేజ 'ఇరుముడి'కి బిగ్ షాక్: ఆ సీన్లు తొలగించాలంటూ డిమాండ్!

తెలంగాణలో ఓ పెద్ద అడ్డంకి తొలగిపోయినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ విషయంలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏపీలో కూడా టికెట్ ధరల పెంపుతో పాటు స్పెషల్ షోలు వేసుకునేందుకు అనుమతి కావాలని చిత్రబృందం ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై ఏపీ ప్రభుత్వం, నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ.. తుది ఆమోదం తెలిపి అధికారిక జీవో జారీ చేయడంలో ఆలస్యం జరుగుతోంది. సినిమా విడుదలకు ఇంకొన్ని గంటలు మాత్రమే ఉండటంతో అనుకూల నిర్ణయం వస్తుందో లేదోనని బాక్సాఫీస్ వర్గాలు, యశ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+