విజయ్ సరసన జోడి కట్టనున్నత్రిప్తి డిమ్రి...శ్రీలీల ఔట్...
విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే అందరికీ అర్జున్ రెడ్డి సినిమా గుర్తుకొస్తుంది. ఆ సినిమా అంతలా అతనికి విజయం తెచ్చిపెట్టింది. ఆ సినిమాతో విజయ్ రౌడీ బాయ్‌గా పేరుతెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన గీతాగోవిందంతో మరింత క్రేజ్‌ను కైవసం చేసుకున్నాడు. అంతుకుముందు అర్జున్‌రెడ్డితో యూత్‌ను ఎంతగానో అట్రాక్ట్ చేసిన విజయ్.. ఈ సినిమాతో ఫ్యామిలీస్‌కు ఎంతగానో దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఈ రౌడీ బాయ్ ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్నాడు. అయితే, ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఫ్యామిలీ స్టార్ సినిమాతో పాటు విజయ్ చేతిలో మరికొన్ని ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మరో ప్రాజెక్టు రాబోతున్నట్లు సమాచారం. ఈ యాక్షన్ సినిమాలో శ్రీలీల నటిస్తున్నట్లు టాక్ వచ్చింది. అయితే, ఈ సినిమాపై ఇప్పుడు నెట్టింట ఓవార్త తెగ హాల్చల్ చేస్తోంది.
గతంలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించడం జరిగింది. ఈ చిత్రం సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమా నుంచి శ్రీలీల తప్పుకున్నట్లు ఆ స్థానంలో యానిమల్ హీరోయిన్ త్రిప్తి దిమ్రిని తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యమవుతున్నట్లు ఆ కారణంగానే శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో ఈ బ్యూటీ ప్లేస్ లోకి బాలీవుడ్ హీరోయిన్, యానిమల్ నటి త్రిప్తి దిమ్రిని తీసుకున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై అటు విజయ్ కానీ, ఇటు సినిమా యూనిట్ కానీ అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

శ్రీలీల స్థానంలో.. యానిమల్ బ్యూటీ...
శ్రీలీలకు మరికొన్ని ప్రాజెక్టులు ఉండడంతో, ఈ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆమె ఈ మూవీ నుంచి తప్పకున్నట్లు టీ టౌన్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సింది. కానీ, విజయ్ ముందు ఫ్యామిలీ స్టార్ సినిమా షూటింగ్‌లు ఉండడంతో దర్శకుడు గౌతమ్ ప్రాజెక్టు కాస్త ఆలస్యమవుతుందని తెలుస్తుంది. ఇక, ఈ సినిమా విషయంలో డేట్స్ అడ్జస్ట్ కాక శ్రీలీల ఔట్ అయినట్లు ఆ స్థానంలో యానిమల్ బ్యూటీని తీసుకున్నట్లు సోషల్‌మీడియాలో ఓ న్యూస్ తెగ ట్రెండ్ అవుతోంది. ఒక్క సినిమాతోనే యానిమల్ నటి మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు. యానిమల్ సినిమా తర్వాత ఆ బ్యూటికి చాలా ఆఫర్లు వచ్చాయి.












Click it and Unblock the Notifications