ఆ హీరోతో బయటపడ్డ త్రిష ఎఫైర్..? ఏకంగా ఇంట్లోనే దుకాణం ..!

గత కొద్దిరోజులుగా తమిళ స్టార్ హీరో విజయ్, హీరోయిన్ త్రిషకు సంబంధించి అనేక కథనాలు వెలుగులోకి వస్తోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు. గతేడాది విజయ్ పుట్టిన రోజు నాడు త్రిష అతనికి ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ఓ పాటను కూడా యాడ్ చేసి మరీ ఓ వీడియోను షేర్ చేయడంతో అది నెట్టింట వైరల్‌గా మారింది.

ఈక్రమంలోనే త్రిష ప్రత్యేకంగా తన సోషల్ మీడియా వేదికగా ఓ ప్రైవేట్ ఫొటో లీక్ చేసిన విషయం తెలిసిందే. పైగా విజయ్ ఇచ్చిన బర్త్ డే పార్టీకి త్రిష కూడా వచ్చారని టాక్ వినిపించింది. ఆ సమయంలో ఆమెకు ఖరీదైన డైమండ్ రింగ్ విజయ్ గిఫ్ట్‌గా ఇచ్చాడనే ప్రచారం జరిగింది.ఇక విజయ్ కోసమే ఆమె ఓ ఐటం సాంగ్‌లో కూడా నటించారు. విజయ్ కోసమని కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఐటం సాంగ్‌లో నటించారామె. తొలుత ఈ సాంగ్‌లో హీరోయిన్ శ్రీలీలను అనుకున్నారు.

Trisha and vijay photo goes virla in social media

కానీ సడన్‌గా శ్రీలీల స్థానంలో త్రిష ఎంట్రీ ఇచ్చారు. అయితే సినిమాలో త్రిష, విజయ్ సాంగ్‌పై ఘోరంగా ట్రోల్స్ నడిచాయి. విజువల్‌గా కూడా ఈ సాంగ్ వరస్ట్‌గా ఉందని సినీ అభిమానులు పెదవి విరిచారు. హీరోయిన్ కీర్తి సురేశ్ పెళ్లి సమయంలో వీరిద్దరు ప్రత్యకంగా ఓ ఫ్లైట్‌లో గోవాకు వెళ్లారు. దీంతో వీరి రిలేషన్ గురించి అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

ఈక్రమంలోనే విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా మరోసారి విజయ్‌, త్రిష వ్యవహారం తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. మరోసారి విజయ్ పుట్టిన రోజు సందర్భంగా త్రిష వార్తల్లో నిలిచారు. త్రిష విజయ్‌కు విషెష్ చెబుతూ 'హ్యాపీ బర్తడే టు డ బెస్ట్టెస్ట్' అంటూ.. ఒక ఫొటో షేర్ చేసింది. ఈ ఫొటోలో విజయ్ కుక్కపిల్లతో ఆడుకుంటూ ఉండగా..పక్కన త్రిష కూడా కూర్చొని కనిపించింది.

ఈ ఫొటోను చూస్తూంటే త్రిష ఇంట్లోనే ఈ ఫొటో తీసినట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరి ప్రేమయాణం గురించి మరోసారి చర్చ నడుస్తోంది. వీరిద్దరి బంధంపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. త్రిష ఇంట్లోనే విజయ్ కాపురం పెట్టాశాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం వీరిద్దరి వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+