ఆ స్టార్ హీరోతో పెళ్లికి సిద్ధమవుతున్న త్రిష
తెలుగు, తమిళంలో అగ్ర కథానాయికగా రాణిస్తోన్న త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 40 సంవత్సరాల వయసు దాటినా పాతికేళ్ల అమ్మాయిలా కనపడుతోంది. అంత గ్లామర్ ను మెయిన్ టైన్ చేస్తోంది. పొన్నియన్ సెల్వన్ సినిమా సమయంలో ఐశ్వర్యారాయ్ కన్నా త్రిష మీదే అందరి చూపులు నిలిచిపోయాయి. అంత అందంగా ఉండటం ఈ వయసులో ఎలా సాధ్యమంటూ హీరోలు, దర్శకుల నుంచి అభిమానుల వరకు అందరి ప్రశ్న అదే.
త్రిష గురించి రోజుకో వార్త వస్తున్నప్పటికీ తాజాగా ఆమె పెళ్లి గురించి వచ్చిన వార్త మాత్రం వైరల్ గా మారింది. ఒక తమిళ నిర్మాతను మనువాడబోతోందంటూ వచ్చిన వార్తను కొట్టేసింది. అయితే ఇప్పటికే పెళ్లయి పిల్లలున్న హీరోను పెళ్లి చేసుకోబోతోందంటున్నారు. వ్యాపారవేత్త వరుణ్ మానియన్ తో గతంలో ఎంగేజ్ మెంట్ జరిగిందికానీ కొన్ని కారణాలవల్ల ఆ వ్యవహారం పెళ్లి పీటలవరకు వెళ్లలేదు.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ని త్రిష వివాహం చేసుకోబోతోందంటూ అనేక వార్తలు వైరల్ గా మారాయి. వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, వివాహం చేసుకోబోతున్నారంటూ గతంలో కూడా వార్తలు వచ్చాయి. కొన్నాళ్ల తర్వాత ఈ వార్తలు ఆగిపోయి మళ్లీ వస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఫిలిం జర్నలిస్టు పాండియన్ ఓ ఇంటర్వ్యూలో త్రిషకు సంబంధించిన రహస్యాన్ని బయటపెట్టారు. త్రిష-విజయ్ మధ్య రిలేషన్ ఉందని చెప్పారు. గతంలో త్రిష ఇంట్లో ఐటీ దాడులు జరిగిన సమయంలో కోటిరూపాయల విలువైన డైమండ్ నెక్లెస్ ను అధికారులు పట్టుకున్నారు. ఎక్కడదని వారు ప్రశ్నించగా హీరో విజయ్ తనకు బహుమతిగా ఇచ్చాడని చెప్పిన విషయాన్ని పాండియన్ బయటపెట్టారు. ఇదే విషయంలో వైరల్ గా మారింది. త్రిష ఇప్పటివరకు పెళ్లిచేసుకోకపోవడానికి కారణం విజయ్ మీద ప్రేమ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీనిపై త్రిషకానీ, విజయ్ కానీ స్పందించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications