ఆ ఇద్దరి హీరోలతో త్రిష ఎఫైర్.. అతనితో పెళ్లి క్యాన్సిల్
హీరోయిన్ త్రిష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 20 ఏళ్లుగా హీరోయిన్‌గా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో త్రిష నటించింది. ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. మహేష్ బాబు, ప్రభాస్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి టాప్ హీరోల సరసన నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. యంగ్ హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడంతో త్రిష హవా తగ్గిపోయింది.
అయితే త్రిష ఇటీవలే మళ్లీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. పొన్నియర్ సెల్వం రెండు పార్ట్‌ల్లో అలరించిన త్రిష, తమిళ స్టార్ హీరో విజయ్ , లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లియో సినిమాలో హీరోయిన్‌గా నటించింది. లియో సినిమా సక్సెస్ తో త్రిష డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీ అయిపోయింది బ్యూటీ. సౌత్ స్టార్ హీరోలుగా వెలుగు వెలుగుతున్న చిరంజీవి, విజయ్, అజిత్, కమల్, మోహన్ లాల్ సినిమాలలో నటిస్తూ బిజీ అయిపోయింది త్రిష. చిరుతో విశ్వంభర సినిమాలో నటిస్తోంది బ్యూటీ.

త్రిష వ్యక్తిగత జీవితానికి వస్తే..ఆమె ఓ బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంది. నిశ్చితార్థం వరకు వెళ్లిన వీరి పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. అప్పటి నుంచి త్రిష సింగిల్‌గానే ఉంటోంది. ఇదిలా ఉంటే త్రిషకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. త్రిష్ టాప్ హీరోయిన్‌గా వెలుగుతున్న సమయంలో హీరో రానాతో ఆమె ప్రేమలో ఉందనే వార్తలు బయటకొచ్చాయి. దానికి తగ్గట్టుగానే వీరిద్దరు చాలా క్లోజ్‌గా కనిపించేవారు. పబ్‌లు, పార్టీల్లో కనిపిస్తూ ఇద్దరు తెగ హంగామా చేశారు. దీంతో రానా, త్రిషలు పెళ్లి చేసుకుంటారనే అంతా భావించారు. కానీ రానా మిహీకా బజాజ్‌ను వివాహం చేసుకుని అభిమానులకు గట్టి షాకిచ్చాడు.
ఇక తమిళ స్టార్ హీరో విజయ్, హీరోయిన్ త్రిషకు సంబంధించిన ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. హీరో విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి సిద్దమయ్యారంటూ ప్రచారం జరిగింది. విజయ్ తన భార్యకు విడాకులిచ్చి త్రిషను వివాహం చేసుకోబోతున్నారంటూ అనేక కథనాలు కూడా వెలిశాయి. అయితే ఈ రూమర్లపై వీరిద్దరు ఇప్పటి వరకు స్పందించలేదు.












Click it and Unblock the Notifications