స్టార్ హీరోతో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న త్రిష..?

గత కొద్దిరోజులుగా తమిళ స్టార్ హీరో విజయ్, హీరోయిన్ త్రిషకు సంబంధించి అనేక కథనాలు వెలుగులోకి వస్తోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు. ఇటీవలే హీరో పుట్టిన రోజు జరిగింది. తమ అభిమాన హీరోకు పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు అభిమానులు. ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు సైతం హీరో విజయ్‌కు బర్త్ డే విషెష్ చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే హీరోయిన్ త్రిష కూడా విజయ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

అంతేకాకుండా ఓ పాటను కూడా యాడ్ చేసి మరీ షేర్ చేయడంతో అది నెట్టింట వైరల్‌గా మారింది. ఈక్రమంలోనే త్రిష ప్రత్యేకంగా తన సోషల్ మీడియా వేదికగా ఓ ప్రైవేట్ ఫొటో లీక్ చేసిన విషయం తెలిసిందే. పైగా విజయ్ ఇచ్చిన బర్త్ డే పార్టీకి త్రిష కూడా వచ్చారని టాక్ వినిపించింది. ఆ సమయంలో ఆమెకు ఖరీదైన డైమండ్ రింగ్ ఇచ్చాడట విజయ్. కోటి రూపాయల విలువ చేసే డైమండ్ నెక్లెస్‌ని కూడా గిఫ్ట్ గా ఇచ్చారట. అదే సమయంలో ఆ డైమండ్ రింగ్ ని త్రిష వేలికి కూడా విజయ్ పెట్టారట.

Trisha s secret engagement with star hero

ఇక ఈ విషయం మీడియాలో ప్రచారం జరగడంతో ఒక్కసారిగా త్రిష విజయ్ డేటింగ్ వార్తలు ఇండస్ట్రీలో దుమారం సృష్టించాయి.దాంతో చాలామంది త్రిష విజయ్‌లు రహస్యంగా స్టార్ హోటల్‌లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారంటూ రూమర్లు క్రియేట్ చేశారు. దీంతో వీళ్లిద్దరు రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. ఇదే సమయంలో హీరో విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి రెడీ అయ్యారనే వార్త తెర మీదకు వచ్చింది. త్రిష కారణంగా హీరో విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇవ్వడానికి సిద్దమవుతున్నారనే రూమర్స్ వినిపించాయి. విజయ్ తన భార్యకు విడాకులిచ్చి త్రిషను వివాహం చేసుకోబోతున్నారంటూ అనేక కథనాలు కూడా వెలిశాయి.

గతంలో విజయ్ ఎప్పుడూ తన భార్యతో కలిసి ఈవెంట్స్‌కు హాజరయ్యేవాడు. కానీ ఇప్పుడు ఏ పార్టీలో నైనా సరే సింగిల్‌గానే కనిపిస్తున్నారు. త్వరలో విడాకులు కూడా తీసుకోవడానికి రెడీ అయ్యారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీనికి తగ్గట్టు సింగర్ సుచిత్ర స్పందించారు.హీరో విజయ్ తన భార్యకు విడాకులు ఇచ్చి, హీరోయిన్ త్రిషను త్వరలోనే వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్న సమయంలో విజయ్ వ్యక్తిగత జీవితం ఇలా వివాదాల్లో చిక్కుకోవడంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+