బన్నీకి బిగ్ షాక్ ఇచ్చిన త్రివిక్రమ్.. నెక్స్ట్ మూవీ ఆ హీరోతోనే !
తెలుగు ప్రేక్షకుల్లో త్రివిక్రమ్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాటల మాంత్రికుడుగా పేరొందిన ఈ డైరెక్టర్ గత కొన్నేళ్లుగా వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు. అరవింద సమేత, అలా వైకుంఠపురంలో, గుంటూరు కారం చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. దీంతో ఇప్పుడు ఆయన తన తదుపరి చిత్రంపై ఫోకస్ పెడుతున్నారు.
అయితే గత కొంత కాలంగా తన నెక్స్ట్ సినిమాని అల్లు అర్జున్ తో కలిసి తెరకెక్కిస్తారని ప్రచారం నడిచింది. మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించే ఈ చిత్రంలో బన్నీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాత్రలో కనిపిస్తారని బజ్ నెలకొంది. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో ఒకదాన్ని మించి మరొకటి తిరుగులేని విజయాలని సాధించాయి. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నట్టు అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

అయితే పుష్ప తర్వాత ఈ సినిమా పట్టాలెక్కాల్సి ఉండగా.. అల్లు అర్జున్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సినిమాని అనౌన్స్ చేశారు. అందులో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటించనుండగా, షూటింగ్ జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. దీంతో త్రివిక్రమ్ సినిమా ప్రాజెక్ట్‌కు బ్రేక్ పడినట్లయింది.
ఈ క్రమంలోనే ఈ భారీ మైథలాజికల్ కథను జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలని త్రివిక్రమ్, నిర్మాత నాగవంశీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చేలా నాగవంశీ ఇటీవల ఎక్స్ (ట్విటర్) లో షేర్ చేసిన ట్వీట్లు హాట్ టాపిక్ గా మారాయి. ''మోస్ట్ పవర్‌ఫుల్ గాడ్ లాగా నాకు ఫేవరేట్ అన్నయ్య కనిపించబోతున్నారు'', ''గాడ్ ఆఫ్ వార్ ఈజ్ కమింగ్'' అంటూ షేర్ చేసిన పోస్ట్ ఫుల్ వైరల్ అవుతోంది. నాగ వంశీ ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ అని అందరికీ తెలిసిందే. దాంతో ఈ వార్త పక్కా అని భావిస్తున్నారు.
అందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు.. కార్తి కేయో మహాసేన శ్శరజన్మా షడాననః, పార్వతీనన్దనః స్కంద స్సేనానీ రగ్నిభూ ర్గుహః.. మయూరాధిరూఢం మహావాక్యగూఢం మనోహారిదేహం మహచ్చిత్తగేహమ్ మహీదేవదేవం మహావేదభావం మహాదేవబాలం భజే లోకపాలమ్'' అని ఉన్నాయి. ఈ కథను బన్నీ కోసం రెడీ చేసుకున్నప్పటికీ.. ఎన్టీఆర్ చేతుల్లోకి ఈ ప్రాజెక్ట్ వెళ్లిందని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.
My most favourite anna as one of the most powerful gods. pic.twitter.com/Vq4dFV3lJd
— Naga Vamsi (@vamsi84) June 11, 2025












Click it and Unblock the Notifications