నక్క తోక తొక్కిన శ్రీముఖి.. పాన్ ఇండియా సినిమాకు ఎంపిక
బుల్లితెరపై చక్కగా రాణించే శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన మాటలతో, చలాకీతనంతో యువతను బాగా ఆకట్టుకుంటుంది. బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సినిమాల్లో కూడా నటిస్తోంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. వాస్తవానికి బుల్లితెరపై శ్రీముఖి కనిపించిందంటే సందడి ఒక రేంజ్ లో ఉంటుంది.
ఏ టీవీలోనైనా ప్రతి పండగకు శ్రీముఖి షో కచ్చితంగా ఉంటుంది. యూత్ లో కూడా ఫాలోయింగ్ బాగుంటుంది. గతంలో పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది. హీరోయిన్ గా నటించడానికి ప్రయత్నించిందికానీ విజయం సాధించలేకపోయింది. తిరిగి చిన్నితెరనే నమ్ముకుంది. తాజాగా శ్రీముఖికి సంబంధించిన ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

ఓ పాన్ ఇండియా హీరో సినిమాలో అవకాశం వచ్చిందంటూ వార్తలు వస్తున్నాయి. ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో ఓ సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీముఖి ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతోందని సమాచారం. అల్లు అర్జున్ కి సిస్టర్ పాత్రలో శ్రీముఖి కనిపిస్తోందంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో నటిస్తే మాత్రం ఆమె రేంజ్ ఓ స్థాయిలో ఉంటుందని అర్థమవుతోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తోందంటున్నారు.
అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ బాలీవుడ్ లో సంచలన విజయం సాధించింది. దీనితర్వాత అల్లు అర్జున్ తో చేయబోతున్నాడు. అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాలని బన్నీ నిర్ణయించుకున్నప్పటికీ గుంటూరు కారం పరాజయం పాలవడంతో ఒక అడుగు వెనక్కి వేసి అట్లీతోనే చేయాలని నిర్ణయించుకున్నాడు. పాన్ ఇండియా సినిమా పుష్ప2పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications