పోయి పోయి రష్మిక అక్కడ పెళ్లి చేసుకుంటుందేంటి ..!

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ 'నేషనల్ క్రష్' రష్మిక మందన్న అభిమానులకు ఇది నిజంగా తీపి కబురే. ఈ ఇద్దరు స్టార్లు త్వరలోనే ఒక ఇంటివారు కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఉధృతంగా ప్రచారం జరుగుతోంది. మరో మూడు నెలల్లో వీరి వివాహ వేడుక జరగనుందని జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల డేటింగ్ రూమర్స్ తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పటి నుంచో ఉన్నాయి. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాల నుంచి మొదలైన ఈ కెమిస్ట్రీ, ఆ తర్వాత వ్యక్తిగత జీవితంలోనూ కొనసాగుతోందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.తాజాగా సినీ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ జంట పెళ్లికి ముహూర్తం కూడా ఖరారైనట్లు తెలుస్తోంది.2026, ఫిబ్రవరి 26వ తేదీన విజయ్, రష్మిక వివాహం చేసుకోబోతున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Udaipur Jinx Fans Debate Vijay Deverakonda amp amp Rashmika Mandanna s Wedding Venue Sentiment

ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు రాజస్థాన్‌లోని చారిత్రక ఉదయ్‌పూర్ ప్యాలెస్ వేదిక కాబోతుందని సమాచారం. ఇరు కుటుంబాలు అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుకను నిర్వహించడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అయితే, ఈ వివాహ వార్తలపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం అభిమానులు ఈ వార్తలను పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. అంతేకాదు, గత నెలలో ఈ జంట రహస్యంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అక్టోబర్ మూడో తేదీన వారి ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు ప్రచారం జరిగింది.

ఈ పుకార్లకు బలం చేకూర్చేలా, రష్మిక మందన్న ఇటీవల ఒక ఇంటర్వ్యూలో హింట్ ఇచ్చారు. నటుడు జగపతిబాబు షోలో తాను పెట్టుకున్న రింగ్ చాలా స్పెషల్ అంటూ చెప్పడం, ఈ నిశ్చితార్థం వార్తలకు మరింత ఆజ్యం పోసింది.

ప్రస్తుతం అభిమానులు సోషల్ మీడియాలో ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతూ, త్వరలోనే ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాలని కోరుకుంటున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ పెళ్లి వేదికపైనే అభిమానులు పెదవి విరుస్తున్నారు. గతంలో అక్కడ వివాహం చేసుకున్న మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకున్నారు. చైతన్య జొన్నలగడ్డను నిహారిక 2020 చేసుకుంది. అయితే పెళ్లైన కొద్ది కాలానికే వీరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. దీంతో ఉదయ్‌పూర్‌లో పెళ్లి వద్దంటూ అభిమానులు విజయ్ దేవరకొండ & రష్మిక మందన్నకు సూచిస్తున్నారు.

అయితే ఈ వాదనను మరికొందరు కొట్టి పారేస్తున్నారు. ఉదయ్‌పూర్‌లోనే పెళ్లి చేసుకోవాలంటూ హితవు పలుకుతున్నారు. స్టార్ హీరోయిన్ శ్రియ శరణ్ తాను ప్రేమించిన ఆండ్రీ కొశ్చీవ్‌ను అక్కడే వివాహం చేసుకున్నారు. అక్కడ పెళ్లి చేసుకున్న వాళ్లు హాయిగా తమ జీవిత భాగస్వామితో కాపురం చేసుకుంటున్నారని మరికొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ , రష్మిక,విజయ్ దేవరకొండ వివాహా వేదిక ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+