లేడీ ఫ్యాన్ ను ముద్దు పెట్టుకున్న స్టార్ సింగర్..
సాధారణంగా ఏ ఫ్యాన్ అయినా తమ అభిమాన హీరోను దగ్గర్నుంచి చూడాలని.. కలిసి షేక్ హాండ్ ఇవ్వాలని, మాట్లాడటానికి ఉత్సాహ పడుతూ ఉంటారు. సెలబ్రిటీలు కూడా తమ ఫ్యాన్స్ కు ఆటోగ్రాఫ్ లు ఇవ్వడం, సెల్ఫీలు దిగడం చేస్తుంటారు. ఇంకెంత మంది తమ ఫ్యాన్స్ తో కలిసి రీల్స్ చేసిన సందర్బాలు కూడా ఉన్నాయి.
అయితే తాజాగా ముంబయిలో జరిగిన ఓ ఘటన చూస్తే అంతకుమించి అనేలా ఉంది. ఓ లేడీ ఫ్యాన్ ను స్టార్ సింగర్ ముద్దు పెట్టుకున్న ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఈ వీడియో నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ స్టార్ సింగర్ పై ఫైర్ అవుతున్నారు. పబ్లిక్ లో ఇలా చేయడం ఏంటని మండిపడుతున్నారు.

ఏం జరిగిందంటే..?
ముంబయిలో జరిగిన ఓ మ్యూజిక్ కన్సర్ట్ లో సీనియర్ స్టార్ సింగర్ ఉదిత్ నారాయణ్ 'టిప్ టిప్ బర్సా పానీ' అనే పాటను ఆలపిస్తున్నారు. అదే సమయంలో ఆయనతో సెల్ఫీలు దిగేందుకు లేడీ ఫ్యాన్స్ స్టేజీ ముందుకు వచ్చారు. వేదికపై ఉన్న ఉదిత్ నారాయణ్ వాళ్ల వద్దకు వచ్చి సెల్ఫీలు దిగడం ప్రారంభించాడు. అంతేకాక మహిళా అభిమానుల బుగ్గలపై ముద్దులు పెట్టారు. ఉదిత్ అలా ఒక్కసారిగా చేయడం వల్ల ఫ్యాన్స్ షాక్ కు గురయ్యారు.ఉదిత్ నారాయణ్ మరో అడుగు ముందుకేసి.. ఓ లేడీ అభిమాని పెదవులపై ముద్దు పెట్టారు.
అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై కొందరు ఉదిత్ నారాయణ్ ను సమర్థిస్తుండగా..మరికొందరు మాత్రం సెలబ్రిటీలు ఇలా చేయడమేంటని.. ఉదిత్ పై మండిపడుతున్నారు. ఇక ఉదిత్ నారాయణ్ 2009లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్ అవార్డులతో భారత ప్రభుత్వం సత్కరించింది.












Click it and Unblock the Notifications