షోలో శ్రీలీల గుట్టు విప్పిన బాలకృష్ణ
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ కొత్త సీజన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మూడు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న అన్‌స్టాపబుల్ షో , నాలుగో సీజన్‌ను ఘనంగా ప్రారంభించింది.ఆహా ఓటీటీలో మొదటి మూడు సీజన్లు సూపర్ సక్సెస్ అయ్యాయి. బాలకృష్ణ హోస్టింగ్ స్టైల్, మాటలు జనాలకు విపరీతంగా ఆకట్టుకున్నాయి. బాలకృష్ణ ఏ ముహూర్తానా అన్‌స్టాపబుల్ మొదలుపెట్టారో కానీ, ఆయనకున్న క్రేజ్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది.
స్టార్ హీరోలకు సాధ్యం కాని విధంగా ఈ షోను ముందుకు నడిపిస్తున్నారాయన. ఇంకా చెప్పాలంటే ఆయన్ను వ్యతిరేకించే వారు కూడా ఈ షో చూసిన తర్వాత బాలయ్యపై తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఇక నాలుగో సీజన్‌లో ,ఏపీ సీఎం చంద్రబాబు, అల్లు అర్జున్, దుల్కార్ సల్మాన్, సూర్య వంటి స్టార్స్ సందడి చేశారు. తాజాగా హీరో నవీన్ పోలిశెట్టితో పాటు, హీరోయిన్ శ్రీలీల ఈ షోలో సందడి చేశారు.తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.

ఈ ప్రోమోలో బాలయ్యతో వీరిద్దరూ డ్యాన్స్ లు వేశారు. బాలయ్య ఎనర్జీ తగ్గట్టు శ్రీలీల కూడా బాగానే అలరించింది. అంతే కాకుండా, సినిమాలకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. ఇప్పటికే బాలయ్య, శ్రీలీల కలిసి నటించడంతో వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. దీంతో షోలో వీరిద్దరు తెగ అల్లరి చేసినట్టు ప్రోమోలో చూపించారు. ఇక ఇదే ఎపిసోడ్‌లో సమాజ సేవచేసే వారికి సైతం అవకాశం కల్పిస్తున్నారు.
ఇందులో భాగంగానే డా.నరేంద్ర కూడా అతిథిగా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆయన సిటీలో ఉద్యోగం వదిలి భద్రాద్రి కొత్తగూడెంలోని గిరిజన గ్రామానికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాడు. అక్కడ నీరు, విద్యుత్ , వైద్యం వంటి కనీస సౌకర్యాలు లేని గిరిజనులకు సేవచేయాలని నిర్ణయించుకున్నారు. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లల సంరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేసి, తన ఉచిత సేవలతో ఎంతోమంది ప్రాణాలను కాపాడారు నరేంద్ర. వైద్య చికిత్స అందించడం, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను మెరుగుపరచడంతోపాటు, గ్రామానికి విద్యను తీసుకురావడం, అక్కడి గ్రామాలకు నీరు, విద్యుత్తు సౌకర్యాలను అందించడంలో డాక్టర్ నరేంద్ర కీలక పాత్ర పోషించారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ డిసెంబర్ 6న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.












Click it and Unblock the Notifications