పవన్ "హరిహర వీరమల్లు" ఈవెంట్ చీఫ్ గెస్టుగా యూపీ సీఎం..!
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో 'హరి హర వీరమల్లు' కూడా ఒకటి. పవన్ కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది ఈ చిత్రం. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసేశారు. ఈ చిత్రాన్ని జూన్ 12న రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. తొలి భాగం హరి హర వీరమల్లు పార్ట్ 1 : స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రంలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. కీలక పాత్రలలో అనుపమ్‌ఖేర్, బాబీ దేవోల్, సునీల్, నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు, నోరా ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్త నటిస్తున్నారు. అలానే ఆస్కార్ అవార్డు గ్రహిత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ విడుదల కానుండగా.. మూవీ ప్రమోషన్స్ ను షురూ చేసింది చిత్ర యూనిట్. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త సినీ వర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా నడుస్తోంది.

రిలీజ్‌కు మరో 20 రోజులు మాత్రమే ఉండటంతో చిత్రయూనిట్ హైదరాబాద్‌తో పాటు తిరుపతి, వారణాసిల్లో గ్రాండ్ ఈవెంట్లను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. పవిత్ర శైవక్షేత్రంగా పేరొందిన వారణాసిలో జరిగే స్పెషల్ ఈవెంట్‌కు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్‌కి బీజేపీతో ఉన్న సత్సంబంధాలు రీత్యా యోగి హాజరు అయ్యే అవకాశముందని భావిస్తున్నారు.
దక్షిణాదిలో బీజేపీకి పవన్ ఒక పవర్ హౌస్ అయితే.. ఉత్తరాదిలో యోగి ఆదిత్యనాథ్ మరో పవర్ హౌస్ గా అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారణాసిలో జరిగే కార్యక్రమంలో పవన్, యోగిలు ఒకే వేదికపై కనిపిస్తే సినిమా పరంగా మంచి బాజ్ ఏర్పడుతుందని భావిస్తున్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది.
భారీ బడ్జెట్ తో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మొదట్లో క్రిష్ దర్శకత్వం వహించగా పలు కారణాలతో ఆయన చిత్రం నుంచి వైదొలిగారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. పవన్ పొలిటికల్ లైఫ్ కారణంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. వాయిదా విషయంలో ఇప్పటికే రికార్డు కొట్టిన ఈ మూవీ.. దాదాపు 12 సార్లు వాయిదా పడింది. మరోవైపు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న OG సినిమాలో కూడా పవన్ పాల్గొంటున్నారు. OG సినిమా షూటింగ్‌ను త్వరగా పూర్తిచేసి దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆ టీమ్ ప్లాన్ చేస్తోంది.
-
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీలో శ్రీలీల పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..? -
అన్న మళ్లీ హిట్ కొట్టాడోచ్.. పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ రివ్యూ..! -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
Pawan kalyan vs Ranveer Singh:ఉస్తాద్ వర్సెస్ ధురందర్..హ్యాట్రిక్ పోరులో గెలుపెవరిది? -
ఉగాది పండగ వేళ చిరంజీవి సంచలన నిర్ణయం.. -
సమంత, రాజ్ నిడిమోరు క్యూట్ వీడియో వైరల్..! -
అనుష్క పెళ్లి ట్విస్ట్: ఆ విషయాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? -
రామ్ చరణ్ 'పెద్ది'లో క్రేజీ ఐటమ్ సాంగ్.. ముగ్గురు స్టార్ హీరోయిన్లతో మాస్ స్టెప్పులు -
ధురంధర్2, ఉస్తాద్ భగత్ సింగ్.. వీటిల్లో ఏ సినిమాకు వెళ్లాలి? -
తెలంగాణ గద్దర్ అవార్డుకు ఎంపికైన తొలి బయోపిక్ ఇదే.. స్పెషాలిటీ అదే !!












Click it and Unblock the Notifications