Upasana: రాజకీయపార్టీ ప్రకటించిన దళపతి విజయ్ పై ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు!!
కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ రాజకీయాలలోకి వస్తున్నట్టు పేర్కొని, రాజకీయ పార్టీ పేరును కూడా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయ పార్టీపై హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల స్పందించారు. హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఒక నటుడుగా విజయ్ ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు అని ఉపాసన కొనియాడారు. ఇప్పుడు ప్రజలకు సేవలు చేయడం కోసం ముందుకు వస్తున్నారని, ఇది చాలా గొప్ప విషయం అని ఉపాసన పేర్కొన్నారు. అందరికీ తను ఒకటే చెప్పాలనుకున్నాను అని పేర్కొన్న ఉపాసన సమాజంలో మార్పు రావాలని కోరుకుంటే, లీడర్ ఎవరు అన్నది చూడకుండా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

అంతేకాదు ఒకవేళ వారికి సపోర్ట్ చేయకపోయినా వెనక్కు మాత్రం లాగకూడదని ఉపాసన పేర్కొన్నారు. మార్పు కోసం వచ్చిన కొత్త నాయకుడికి మద్దతుగా నిలవాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. తమిళనాడు రాజకీయాలలో కూడా మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఉపాసన. అంతేకాదు మార్పు తీసుకువచ్చే నాయకుడికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.
ఇక ఉపాసన రాజకీయాల్లోకి వచ్చే అంశం పైన కూడా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని, తాను వచ్చే అవకాశమే లేదని ఆమె స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తమిళగ వెట్రి కళగం పేరుతో కొత్త పార్టీని ప్రకటించిన దళపతి విజయ్ 2026 ఎన్నికల లక్ష్యంగా తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు.
ప్రస్తుతం తమిళనాడులో అవినీతి పాలన కొనసాగుతుందని, దానిపై పోరాటం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని, 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బరిలోకి దిగుతామని వెల్లడించారు. ఇటు విజయ్ మాత్రమే కాదు, హీరో విశాల్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో తమిళనాడులో ఈసారి ఎన్నికలు ఆసక్తికరంగా మారతాయని అర్థమవుతుంది.












Click it and Unblock the Notifications