గుడ్‌న్యూస్ చెప్పిన ఉపాసన... ఆనందంలో మెగా ఫ్యామిలీ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ కు భార్య కాకముందే అపోలో గ్రూప్ ఆసుపత్రులకు ఒక డైరెక్టర్ గా, మ్యాగజైన్ ఎడిటర్ గా, సంఘ సేవకురాలిగా విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. వివాహమై ఒక కుమార్తెకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఈ జంట ఇంతవరకు చిన్నమాట కూడా అనుకోకుండా అన్యోన్యంగా జీవిస్తూ ఇతర జంటకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. క్లింకార జన్మించిన తర్వాత మెగా కుటుంబానికి బాగా కలిసివచ్చిందనే సెంటిమెంట్ బాగా పడిపోయింది. దీంతో ఆ పాపను ఎంతో గారాబంగా చూసుకుంటున్నారు.
సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నా
సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే ఉపాసన తాజాగా ఒక పోస్ట్ చేసింది. ఇది ఎందుకంటే.. హాలీవుడ్ హీరోయిన్ అయిన బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకచోప్రా రెండురోజుల క్రితం హైదరాబాద్ వచ్చింది. నిన్న చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని సందర్శించి పూజలు చేసింది. ఈ సందర్భంగా తాను కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రియాంక వెల్లడించింది.

దీనిపై స్పందించిన ఉపాసన మీ కొత్త సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నానని, శ్రీ వెంకటేశ్వరస్వామి మిమ్మల్ని సంపూర్ణంగా అనుగ్రహించాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆ పోస్ట్ లో రాసింది. అయితే ఆ సినిమా ఏది అనే విషయం మాత్రం ఎవరికీ స్పష్టత లేదు. దీనిపై మెగా కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన, మన అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి మంచిని ఉపాసన కోరుకుంటుందని, ఇటువంటి కోడలు దొరకడం తమ అదృష్టమని చిరంజీవి - సురేఖ దంపతులు మురిసిపోతున్నారు.
అంతా రాజమౌళి మహిమ
అందరూ అనుకునేది మాత్రం రాజమౌళి-మహేష్ బాబు సినిమా అని భావిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంకచోప్రా హీరోయిన్ గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే ఆమె తన భర్తతో కలిసి హైదరాబాద్ వచ్చిందని, షూటింగ్ లో పాల్గొంటోందని తెలుస్తోంది. ఇందులో వాస్తవమెంత అనేది తెలియాల్సి ఉంది. ఉపాసన చేసిన పోస్ట్ ప్రకారం రాజమౌళి సినిమా అని అందరూ గట్టిగా భావిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. రూ.1500 కోట్ల భారీ బడ్జెట్ తో దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో దీన్ని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు ఇంతవరకు ఏ సినిమాకు కష్టపడని రీతిలో చెమటోడుస్తున్నాడు. అంతా రాజమౌళి మహిమ.
-
సొంత సినిమాను వదిలేసి పరాయి సినిమాకు భజనా? -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
ఉగాది పండగ వేళ చిరంజీవి సంచలన నిర్ణయం.. -
అన్న మళ్లీ హిట్ కొట్టాడోచ్.. పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ రివ్యూ..! -
సమంత, రాజ్ నిడిమోరు క్యూట్ వీడియో వైరల్..! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
అనుష్క పెళ్లి ట్విస్ట్: ఆ విషయాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? -
రామ్ చరణ్ 'పెద్ది'లో క్రేజీ ఐటమ్ సాంగ్.. ముగ్గురు స్టార్ హీరోయిన్లతో మాస్ స్టెప్పులు -
‘ధురంధర్2’లో హైలైట్స్ ఇవే.. దద్ధరిల్లుతున్న థియేటర్లు











Click it and Unblock the Notifications