'హ్యాపీ మ్యారేజ్ కు సింపుల్ సలహా ఇదే'.. ఓపెన్ అయిన ఉపాసన

టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన ముందు వరుసలో ఉంటారు. ఈ జంట ఎంతో అన్యోన్యంగా ప్రేమానురాగాలతో ఉంటుంది. కాలేజీ రోజుల్లో కలుసుకున్న వీరిద్దరూ స్నేహితులుగా మారి, ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. అలా రామ్ చరణ్, ఉపాసన జూన్ 2012లో వివాహం చేసుకున్నారు. 2023, జూన్ 20న వీరికి ఆడపిల్ల జన్మించింది. చిన్నారికి క్లింకార అని పేరు పెట్టారు. ఇక ప్రస్తుతం ఉపాసన.. ఉపాసన అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌ లో CSR వైస్ చైర్‌ పర్సన్‌ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్.. పెద్ది చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 26 న విడుదల కానుంది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఉపాసన కొణిదెల కీలక విషయాలను వెల్లడించారు. తమ హ్యాపీ మ్యారేజ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇప్పటి యువ జంటలకు ఇవి ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఉపాసన.. తన తల్లి చెప్పిన మాటలను అనుసరించి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ను లీడింగ్ చేస్తున్నారు. ధృఢమైన సంబంధాలకు వీక్లీ డేట్ నైట్ కచ్చితంగా అవసరమని తనకు తన తల్లి చెప్పిందని దీన్నే పాటిస్తూ తమ మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా సాగిపోతుందని ఉపాసన తెలిపారు. ఇది చిన్న విషయం అయినప్పటికీ దీని ప్రభావం చాలా ఉంటుందని పేర్కొన్నారు.

Upasana Shares Mom s Secret to a Happy Marriage Weekly Date Nights with Ram Charan

"డేట్ నైట్స్ అంటే రెస్టారెంట్స్ కు వెళ్లడం కాదు.. ఇంట్లోనే ఒంటరిగా ఫోన్లు, టీవీలు, లేకుండా బయటి ప్రపంచాన్ని కాసేపు పక్కనపెట్టి ఓపెన్ గా మాట్లాడుకుంటాం. ముఖ్యంగా కష్ట సమయాల్లో ఇలా మాట్లాడుకోవడం ద్వారా రీ కనెక్ట్ అవుతాం" అని ఉపాసన తెలిపారు. బిజినెస్ గోల్స్ లానే రిలేషన్ షిప్ రివ్యూస్ అవసరం అని వివరించారు. ఇవి వ్యక్తిగత, కుటుంబ, కెరీర్ గోల్స్ ను పెంపొందిస్తాయని అన్నారు. తన కెరీర్, పర్సనల్ లైఫ్ ను చరణ్ ప్రోత్సహిస్తారని ఉపాసన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+