స్టార్ హీరోయిన్‌తో విడాకులు.. నిశ్శబ్దంగా రెండో పెళ్లి !

బాలీవుడ్ సీనియర్ నటి, రంగీలా ఫేమ్ ఊర్మిళా మతోండ్కర్ మాజీ భర్త మొహసిన్ అక్తర్ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఊర్మిళతో విడిపోయిన రెండేళ్ల తర్వాత ఆయన నిధా భట్ అనే యువతిని ఓ ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నాడు. ఆదివారం నాడు జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించి ఫోటోలను మొహసిన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఓ సుదీర్ఘమైన సందేశాన్ని రాసుకొచ్చారు.

భార్యపై ప్రేమను వ్యక్తపరుస్తూ ఎమోషనల్ పోస్ట్
మొహసిన్ అక్తర్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చాడు. "పవిత్రమైన ఉద్దేశాలు, నిజాయితీ గల ప్రేమ, హృదయం నిండా ఓర్పు, కృతజ్ఞత. మీ ఆత్మను పవిత్రంగా ఉంచుకోండి, జీవిత ప్రయాణంలో గాయాలను నయం చేసుకోండి.. అల్లాహ్ రాసే స్క్రిప్ట్ ఎప్పుడూ అద్భుతంగా ఉంటుందని నమ్మండి. సరైన సమయంలో నా అందమైన భార్య నిధా భట్‌ను నా జీవితంలోకి పంపించి, ఆమె నిజాయితీతో నన్ను అల్లాహ్ ఆశీర్వదించారు. నువ్వు నా జీవితంలోకి వెలుగులు తీసుకొచ్చావు.. థాంక్యూ మై లవ్." అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చాడు.

Urmila Matondkar Ex-Husband Mohsin Akhtar Marries Nidhaa Bhatt Two Years After Divorce

ఊర్మిళా, మొహసిన్ అక్తర్ వివాహ బంధం
మొహసిన్ అక్తర్ గతంలో నటి ఊర్మిళా మతోండ్కర్‌ను వివాహం చేసుకున్నాడు. 2016 ఫిబ్రవరి 4న అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. ఆ సమయంలో వీరి పెళ్లి పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే మొహసిన్ అక్తర్.. ఊర్మిళ మతోండ్కర్ కంటే పదేళ్లు చిన్నవాడు కావడమే కాకుండా వీరిది భిన్న మతాల వివాహం కావడం కూడా చర్చనీయాంశమైంది. అయితే 2024లో వీరి వైవాహిక జీవితంలో విభేదాలు రావడంతో అదే ఏడాది సెప్టెంబర్‌లో ఊర్మిళ ముంబై కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.

కాశ్మీరీ మోడల్ టూ బిజినెస్ మెన్
కాశ్మీర్‌కు చెందిన మొహసిన్ అక్తర్ ఓ మోడల్, బిజినెస్‌మెన్. 2014లో ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా మేనకోడలి పెళ్లిలో ఊర్మిళ, మొహసిన్ అక్తర్ మొదటిసారి కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి 2016లో పెళ్లి పీటలెక్కింది. వీరి వివాహ వేడుకకు హాజరైన కొద్దిమంది ప్రముఖులలో మనీష్ మల్హోత్రా ఒకరు. పెళ్లి తర్వాత ఈ జంట అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించి ఆ తర్వాత నికాహ్ చేసుకున్నారు.

చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఊర్మిళ
ఊర్మిళ మతోండ్కర్ బాలనటిగా తన సినీ కెరీర్‌ను ప్రారంభించారు. 'కలియుగ్', 'మాసూమ్' వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన ఆమె.. 1991లో వచ్చిన 'నరసింహ' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'రంగీలా' సినిమాతో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. జుదాయి, సత్యా, కౌన్, ప్యార్ తూనే క్యా కియా, భూత్, ఏక్ హసీనా థీ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ఆమె అద్భుతమైన నటనను కనబరిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+