16 ఏళ్లకే పెళ్లి.. 17 ఏళ్లకే తల్లి.. 18 ఏళ్లకే విడాకులు.. ఆ హీరోయిన్ ఎవరు..?
16 ఏళ్లకే పెళ్లి.. 17 ఏళ్లకే తల్లి.. 18 ఏళ్లకే విడాకులు.. ఏంటి వింటానికే విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఆ నటి జీవితంలో ఇదే జరిగింది. సాధారణంగా ఏ హీరోయిన్ అయినా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాక చాలా సినిమాల్లో నటించి స్టార్ డమ్ వచ్చాక సినిమాలకు స్వస్తి చెప్పి వివాహం చేసుకుంటారు. ఇలా చాలామంది నటీమణుల్లో జరుగుతుంది. కానీ ఈ నటి జీవితంలో మాత్రం అలా జరగలేదు. మరి ఎవరు ఆ స్టార్ హిరోయిన్..?
ఊర్వశీ ధోలాకియా.. హిందీ టెలివిజన్ రంగంలో ఓ వెలుగువెలిగింది. కసౌతీ జిందగీ క్యా టీవీ సీరియల్ లో కోమోలికా అనే క్యారెక్టర్ తో ఒక్క రాత్రిలోనే స్టార్ నటిగా మారింది. ఊర్వశీ ఒక పంజాబీ కుటుంబంలో జన్మించింది. 1987లో శ్రీకాంత్ టీవీ సీరియల్ తో ఆమె ప్రయాణం మొదలైంది. ఈ సీరియల్ లో రాజ్యలక్ష్మీ పాత్రలో ఆమె మెప్పించింది. ఆ తర్వాత 2001 నుంచి 2008 వరకు ప్రసారమైన కసౌతీ జిందగీ క్యా టీవీ సీరియల్ లో కోమోలికా పాత్రలో నటించింది. ఈ పాత్ర ఆమెకు చాలా గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ సీరియల్ లో ఆమె విలన్ పాత్రలో మెరిసి మెప్పించింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో, సీరియల్స్ లో తల్లి పాత్రల్లో నటించింది. బిగ్ బాస్ 6 సీజన్ లో పాల్గొంది. నాగినీ సీరియల్లోనూ నటించింది.

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. తన వ్యక్తిగత జీవితాన్ని బయట పెట్టారు. "నాకు 16 ఏళ్లకే పెళ్లి అయింది. 17 ఏళ్లకే ఓ బిడ్డకు జన్మనిచ్చాను. ఇప్పుడు నాకు ఇద్దరు కొడుకులు. అయితే దురదృష్టవశాత్తూ 18 ఏళ్లకే ఆ వ్యక్తి నన్ను వదిలి వెళ్లిపోయాడు. దీంతో ఇండస్ట్రీలో చాలా మంది తనకు వివాహేతర సంబంధాలు అంటగట్టారు. కానీ నేను వాటిని పట్టించుకోలేదు. అత్యంత దుర్భర పరిస్థితుల్లో నా పిల్లల్నిపెంచి పెద్దచేశాను. నా కుమారులే నా జీవితం " అని చెప్పుకొచ్చింది.












Click it and Unblock the Notifications