నా బాత్రూం వీడియో లీక్ వెనుక ఉన్నది వాళ్లే..స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న హీరోయిన్స్ పేర్లలో ఊర్వశి రౌతేలా కూడా ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ .. అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగులో చిరంజీవి, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోలతో ఐటం సాంగ్స్ చేసి ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ఊర్వశి రౌతేలా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు, హాట్ ఫొటోలను అభిమానుల కోసం తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.
క్రికెటర్ రిషబ్ పంత్‌తో కొన్నాళ్లు డేటింగ్ చేసిన ఈ భామ ఆ తర్వాత అతనికి బ్రేకప్ చెప్పింది. ఇదిలా ఉంటే ఆ మధ్య ఊర్వశి రౌతేలాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అందులో ఊర్వశి రౌతేలా బట్టలు విప్పుతున్నట్లు కనిపిస్తోంది. అది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. తాజాగా ఆ వీడియోపై ఊర్వశి రౌతేలా స్పందించారు. తాను కావాలనే ఆ వీడియోను విడుదల చేశానంటూ ఊర్వశి రౌతేలా చెప్పుకొచ్చింది.'ఘుస్పైథియా' సినిమాలోని సీన్ అది అంటూ వివరణ ఇచ్చింది.

ఆ సినిమా మేకర్స్ నా దగ్గరకు వచ్చి ఏడ్చారు.ఆ సినిమా కోసం ఆస్తులన్నీ అమ్మి మరీ తీశామని.. కొన్ని కారణాల వల్ల విడుదల చేయలేకపోయామని బాధపడ్డారు. బాత్ రూమ్ వీడియో లీక్ చేస్తే సినిమాకు బజ్ వస్తుందని రిక్వెస్ట్ చేశారు. సినిమా మేకర్స్ కోరిక మేరకే ఆ వీడియోను లీక్ చేశానని..ఇదంతా మేకర్స్ అనుమతితోనే జరిగిందని ఊర్వశి రౌతేలా చెప్పుకొచ్చింది.ఆ బాత్రూమ్ సీన్ చూసిన తర్వాత అమ్మాయిలు ఇంకాస్త జాగ్రత్తగా ఉంటారని ఉద్దేశంతోనే అలా చేశానని ఊర్వశి రౌతేలా వివరణ ఇచ్చింది.












Click it and Unblock the Notifications