ఫోన్ పోగొట్టుకున్న హీరోయిన్..ఆ పని చేస్తే ఇస్తానంటూ ఆగంతకుడు మేసేజ్
ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న హీరోయిన్స్ పేర్లలో ఊర్వశి రౌతేలా కూడా ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ .. అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగులో చిరంజీవి, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోలతో ఐటం సాంగ్స్ చేసి ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ఊర్వశి రౌతేలా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు, హాట్ ఫొటోలను అభిమానుల కోసం తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.
అయితే ఇటీవలే తన ఫోన్‌ను ఊర్వశి రౌతేలా పోగొట్టుకుందనే విషయం అందరికి తెలిసిందే. ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ చూడటానికి వచ్చి ఊర్వశి రౌతేలా తన ఫోన్‌ను పోగొట్టుకుంది. అంతకముందే తాను ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ చూడటానికి మైదానానికి వచ్చానని ఓ వీడియోను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఊర్వశి రౌతేలా గ్రౌండ్‌కు రావడంతో అభిమానులు భారీ ఎత్తున ఆమెను చూడటానికి ఎగబడ్డారు. ఆ సమయంలోనే ఊర్వశి రౌతేలా పోగొట్టుకుంది.

నా ఫోన్ కనిపించడం లేదని..ఎవరికైనా మొబైల్ దొరికితే ఇవ్వాలని అభిమానులను ఊర్వశి రౌతేలా రిక్వెస్ట్ చేసింది. ఫోన్ తిరిగి ఇచ్చిన వారి బాహుమతి కూడా ఇస్తానని ఈ హాట్ హీరోయిన్ ప్రకటించింది. ఫోన్ దొరికిందని ఓ అజ్ఞాతవాసి తనకు మెయిల్ చేశాడని ఊర్వశి రౌతేలా చెప్పుకొచ్చింది. అయితే ఫోన్ తిరిగి ఇవ్వడానికి అతను ఓ కండిషన్ కూడా పెట్టాడని ఊర్వశి రౌతేలా వెల్లడించింది.

'క్యాన్సర్‌తో బాధపడుతున్న నా సోదరుడిని కాపాడుకోవడం కోసం సాయం చేయండి' ఫోన్ మీకు తిరిగి ఇస్తానని సదరు వ్యక్తి కండీషన్ పెట్టాడు. దీనికి ఊర్వశి రౌతేలా కూడా సరే అంటూ సమాధానం ఇచ్చారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మొత్తానికి ఊర్వశి రౌతేలా ఫోన్ ఓ ప్రాణాన్ని నిలబెట్టిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
-
నా బ్యూటీ సీక్రెట్ రహస్యం అదే.. అసలు విషయం బయటపెట్టిన తెలుగు హీరోయిన్ -
66 ఏళ్ల వయసులో ఆ నటి తల్లి కాబోతుందా ??? -
తెలుగులో టీఆర్పీ రేటింగ్‌లో నెం.1 సినిమా ఇదే -
తెలుగు సినీ ఇండస్ట్రీలో ‘ముగ్గురు మొనగాళ్లు’ ఎవరో తెలుసా? -
అట్టర్ ఫ్లాప్ అనే టాక్‌తో మొదలై చివరకు బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు ఇవే -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!?












Click it and Unblock the Notifications