"ఇది భగత్ గీత.. దమ్మున్నోడు దాటొచ్చు"

పవర్‌స్టార్‌ పవన్​ కల్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ​'ఉస్తాద్‌ భగత్‌సింగ్' నుంచి తాజాగా ట్రైలర్ టీజ్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ టీజ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. ఇప్పటికే ఈ సినిమా చుట్టూ భారీ హైప్‌ నెలకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ట్రైలర్ గ్లింప్స్ రిలీజ్ కావడంతో పవర్‌స్టార్‌ అభిమానులు ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూసేద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'ఉస్తాద్‌ భగత్‌సింగ్' మూవీ మార్చి 19 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతోంది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబో అంటే టక్కున గుర్తొచ్చే సినిమా గబ్బర్ సింగ్. ఈ మూవీ రిలీజై ఇన్నేళ్లు గడుస్తున్నా.. ఈ సినిమాలోని డైలాగ్స్, పాటలు ఇప్పటికీ ట్రెండ్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా ఈ పవర్ ఫుల్ కాంబోలో వస్తున్న మరో మూవీ 'ఉస్తాద్‌ భగత్‌సింగ్'.. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ టీజ్ రిలీజ్ అయింది. కేవలం 44 సెకన్లు ఉన్న ట్రైలర్ టీజ్ లో పవన్ కల్యాణ్ లుక్స్ అద్దిరిపోయాయి. కౌబాయ్ గెటప్ లో పవర్ స్టార్ పిచ్చెక్కిస్తున్నారు. ఇక డైలాగ్స్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి. "ఇది భగత్ గీత.. దమ్మున్నోడు దాటొచ్చు" అనే డైలాగ్ ట్రైలర్ గ్లింప్స్ కే హైలెట్ అని చెప్పొచ్చు.

ఇక ఈ మూవీ మార్చి 19 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. మొదటగా మార్చి 26న రిలీజ్ అని ప్రకటించారు. కానీ, అనుకున్న దానికంటే వారం ముందుగానే ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ఇటీవల అధికారికంగా ప్రకట చేసింది. దీంతో అడ్వాన్ బుకింగ్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ మూవీపై అంచనాలను పెంచేశాయి.

UstaadBhagatSingh Latest Trailer Out now Pawan Kalyan s Power-Packed Action Blast as IPS Officer

ఇక ఈ మూవీ పొలిటికల్ రిఫరెన్స్ లేదా రీమేక్​ అనే సందేహాల నేపథ్యంలో ఇటీవల దర్శకుడు హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ రీమేక్ కాదని, స్టైయిట్ సినిమానే అని తెలిపారు. అలాగే ఈ చిత్రానికి రాజకీయాలకు సంబంధం లేదన్నారు. ఇక మూవీ విషయానికి వస్తే పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. యంగ్ బ్యూటీ శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్​ పై ఈ సినిమాను రవిశంకర్ నిర్మించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+