పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్ డేట్ ఇదేనా..?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కల్యాణ్ నుంచి వస్తున్న మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. పవన్- హరీష్ శంకర్ కాంబోలో గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. దాంతో వీరి కాంబోపై ఫ్యాన్స్ లో అంచనాలు విపరీతంగా పెరిగాయి. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
అయితే ఈ క్రేజీ మూవీపై సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ మూవీ సమ్మర్ కానుకగా మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే రిలీజ్ డేట్ పై త్వరలోనే క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సమ్మర్ లో భారీ అంచనాలతో రానున్న సినిమాల్లో నేచురల్ స్టార్ నాని ప్యారడైజ్ (మార్చి 26), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది (మార్చి 27) రిలీజ్ కానున్నాయి. అయితే ఈ మూవీస్ ఈ తేదీలకే రిలీజ్ అవుతాయా..? లేక వాయిదా పడతాయా..? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే రామ్ చరణ్ పెద్ది సినిమా వాయిదా అంటూ పలు కథనాలు వచ్చాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే తాజాగా ఇప్పుడు పవన్ కల్యాణ్ సినిమా సమ్మర్ బరిలోకి రావడంతో పెద్ది సినిమా నిజంగానే వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

మరోవైపు మార్చి 19 వ తేదీన తెలుగు సినిమాలతో పాటు కేజీఎఫ్ స్టార్ యశ్ 'టాక్సిక్', రణ్ వీర్ సింగ్ 'ధురంధర్ 2' సినిమాలు కూడా రానున్నాయి. మరి ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ సినిమా పోస్ట్ పోన్ అవుతుందా..? లేక పెద్ది సినిమా పోస్ట్ అవుతుందా..? చూడాలి..












Click it and Unblock the Notifications