'బేబీ' నటి ఎమోషనల్.. అవన్నీ దాటొచ్చా నంటూ..
బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో నెట్టుకురావడమే గగనం. అలాంటి హీరోయిన్ ఛాన్స్ కొట్టేయడం అంటే మాటలా.. చాలా కష్టం. సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంత బిజీ అయిపోయింది ఓ తెలుగు అమ్మాయి. ఆమెనే వైష్ణవి చైతన్య.
యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్ దగ్గర నుంచి ప్రారంభమైన ఆమె జర్నీ.. సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి.. చివరకు 'బేబి' మూవీతో హీరోయిన్‌గా మారి ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయింది. తాజాగా జాక్ మూవీతో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డతో రొమాన్స్ చేస్తోందీ బ్యూటీ. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె సంచలన విషయాలను బయటపెట్టింది. తనకు చిన్నప్పటి నుంచే యాక్టర్ అవ్వాలన్న కోరిక ఉన్నట్లు తెలిపింది.

"లైఫ్‌లో ఏదైనా మనకు త్వరగా దక్కితే దాని విలువ తెలియదు. కష్ట పడాలి. నేను అందరిలాగానే చాలా ఇబ్బందులు పడ్డాను. జాబ్ చేస్తూ వచ్చిన డబ్బులతో చిన్నా చితక షార్ట్ ఫిలిమ్స్ చేసేదాన్ని. ఇలా ఏ ఒక్క అవకాశం కూడా వదల్లేదు. అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. అలా నా జర్నీ ఇక్కడి వరకు వచ్చింది. యూట్యూబర్స్ కష్టాలు నాకు తెలుసు. బడ్జెట్ లేక ఇబ్బందులు పడతారు. షూటింగ్ టైమ్ లో నేను పార్క్ లలో వాష్ రూమ్‌లో బట్టలు మార్చుకున్న రోజులు కూడా ఉన్నాయి" అని నటి వైష్ణవీ చైతన్య పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి.












Click it and Unblock the Notifications