"ఆ స్టార్ హీరోకు నాపైనే కన్ను.. అతడి వల్ల నా కెరీర్ క్లోజ్.."

సినీ ఇండస్ట్రీలో స్టార్ గా ఎదగాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. రాత్రికి రాత్రే విజయం వరించడం అసాధ్యం. చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూ అలా హీరోగా.. స్టార్ హీరోగా ఎదుగుతుంటారు. తమ నటన, డ్యాన్స్ తో ఆకట్టుకుంటారు. అయితే తెర వెనుక కూడా ఎన్నో పరిణామాలు జరుగుతుంటాయి. అవకాశాల కోసం అడ్డదారులూ ఉంటాయి. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన వారే కాదు.. స్టార్ హీరోయిన్లు కూడా క్యాస్టింగ్ కౌచ్‌ సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే బాలీవుడ్ సీనియర్ నటి వైష్ణవి మెక్‌ డొనాల్డ్‌ అలియాస్ వైష్ణవి మహంత్ కొన్ని షాకింగ్ విషయాలను బయట పెట్టారు.

ఒకప్పుడు సినిమాల్లో యాక్టివ్‌ గా ఉన్న వైష్ణవి మెక్‌డొనాల్డ్‌.. ఆ తర్వాత పలు కారణాల వల్ల వెండితెరకు గుడ్‌ బై చెప్పేశారు. ఆ తర్వాత బుల్లితెరపై నటిస్తున్నారు. 1998 నుంచి 2005 వరకు దూరదర్శన్‌ లో టెలికాస్ట్ అయిన శక్తిమాన్ ధారావాహికలో గీతా విశ్వాస్ రోల్‌ లో వైష్ణవి ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. ఇప్పటికీ శక్తిమాన్ సీరిస్ ద్వారానే వైష్ణవి మెక్‌డొనాల్డ్‌ను జనం గుర్తుపెట్టుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమాలకు దూరం కావడానికి గల కారణాన్ని వెల్లడించారు వైష్ణవి. ఈ ఇంటర్వ్యూలో వైష్ణవి మాట్లాడుతూ కీలక విషయాలను బయటపెట్టారు. 'ఒక పెద్ద సినిమాలో ప్రధాన పాత్ర కోసం నన్ను ఎంపిక చేశారు. పోస్టర్స్‌, బ్యానర్స్‌ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే ఆ మూవీ నుంచి తప్పుకున్నానని తెలిపారు. దానికి గల కారణం వివరిస్తూ.. 'నేను ఎక్కడికి వెళ్లినా అమ్మను వెంట తీసుకెళ్లడం అలవాటు. కానీ ఓ సాయంకాలం మీటింగ్‌ కోసం నన్ను ఒంటరిగా రమ్మన్నారు. ఆ పార్టీలో అందరూ మగవాళ్లే ఉంటారని.. కలిసి మందు తాగొచ్చన్నారు. నాకది అసలు నచ్చలేదు. అమ్మ ఎల్లప్పుడూ నా వెంటే ఉండటం వాళ్లకూ నచ్చేది కాదు' అని గుర్తు చేసుకున్నారు.

VaishnaviMahant Drops Shocking Revelations About Then Star Hero Explosive Details Go Viral

ఇక ఓసారి షూటింగ్‌ కోసం స్విట్జర్లాండ్‌ వెళ్లాల్సి ఉంటుందని ఆ నిర్మాణ సంస్థ నాకు పాస్‌ పోర్ట్‌ సిద్దం చేసింది. కానీ మా అమ్మకు మాత్రం పాస్‌ పోర్ట్‌ రెడీ చేయలేదు. ఇక ఆ స్టార్ హీరోకు నాపైనే కన్ను. అతడి ప్రపోజల్‌ రిజక్ట్‌ చేయడంతో నాపై పగబట్టాడు. అలా హీరో, దర్శకుడు, నిర్మాత కలిసి నన్ను సినిమా నుంచి తీసేశారని వైష్ణవి పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+